మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లా మహాద్ లో బహుళ అంతస్థుల భవనం ఒకటి ఒక్కసారిగా కూలిపోయింది. శిథిలాల కింద అనేకమంది చిక్కుకునిపోయినట్టు భావిస్తున్నారు. ఈ ఘటనలో 15 మంది గాయపడ్డారు. సుమారు 70 మంది శిథిలాల కింద చిక్కుకునిపోయినట్టు తెలుస్తోంది. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కు చెందిన మూడు బృందాలు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నాయి.