కేంద్రం జోక్యం చేసుకోవాలి : రాజ్యసభలో కనకమేడల

|

Sep 20, 2020 | 2:25 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని తెలుగుదేశం రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ కోరారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని రాజ్యసభలో ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జీరో అవర్లో మాట్లాడిన కనకమేడల.. తిరుమలలో అన్యమతస్తుల ప్రవేశానికి ఇవ్వాల్సిన డిక్లరేషన్ నిబంధనను రద్దు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో రాష్ట్రపతులు, ఇతర ప్రముఖులు సైతం డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతనే ఆలయ ప్రవేశం చేశారని గుర్తుచేశారు. […]

కేంద్రం జోక్యం చేసుకోవాలి : రాజ్యసభలో కనకమేడల
Follow us on

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని తెలుగుదేశం రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ కోరారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని రాజ్యసభలో ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జీరో అవర్లో మాట్లాడిన కనకమేడల.. తిరుమలలో అన్యమతస్తుల ప్రవేశానికి ఇవ్వాల్సిన డిక్లరేషన్ నిబంధనను రద్దు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో రాష్ట్రపతులు, ఇతర ప్రముఖులు సైతం డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతనే ఆలయ ప్రవేశం చేశారని గుర్తుచేశారు. అన్యమతస్తులు తిరుమల ఆలయ ప్రవేశం కోసం డిక్లరేషన్ ఇవ్వాలన్న నిబంధనలను రద్దు చేయడం ద్వారా ఆలయ పవిత్రతకు భంగం వాటిల్లుతుందని, హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని తెలిపారు. అంతర్వేదిలో, విజయవాడలో దేవాలయాలపై జరిగిన దాడులపై రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఈ అంశంపై జోక్యం చేసుకుని సరైన చర్యలు చేపట్టాలని రాజ్యసభ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు కనకమేడల రవీంద్ర కుమార్ పేర్కొన్నారు.