వివాహితను వేధించిన కేసులో న్యాయమూర్తి వినూత్న తీర్పును వెలువరించారు. వేధింపుల కేసులో శిక్షను అనుభవిస్తున్న ఓ ఖైదీకి మధ్యప్రదేశ్ హైకోర్టు వినూత్న షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. వేధించిన మహిళతో రాఖీ కట్టించుకోవాలి. అంతేకాకుండా ఆమెకు రూ.11 వేలు ఇచ్చి.. ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పారు.
వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో 30 ఏళ్ల వివాహిత ఇంటికి వెళ్లి వేధించిన కేసులో విక్రమ్ బాగీ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. అనంతరం అతన్ని జైలుకు తరలించారు. దీంతో విక్రమ్ బెయిల్‌కు పిటిషన్ దాఖలు చేశారు. ఇండోర్ బెంచ్ దీనిపై విచారణ చేపట్టి.. 50 వేల రూపాయాల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేయడమే కాకుండా కొన్ని షరతులను విధించింది. ఇలా చేస్తేనే బెయిల్ మంజూరు చేయడం జరుగుతుందని న్యాయమూర్తి రోహిత్ ఆర్య చెప్పారు. అంతేకాకుండా అందుకు సంబంధించి వీడియో కూడా చూపించాలని ఆదేశాలు జారీ చేశారు న్యాయమూర్తి.
నిందితుడు వేధించిన మహిళ ఇంటికి స్వీట్ బాక్సుతో పాటు ఆమె చేత రాఖీ కట్టించుకోవాలి. అలాగే ఆమెకు 11 వేల రూపాలయను గిఫ్టుగా ఇవ్వాలి. అంతేకాకుండా ఆ మహిళ కొడుకుకి 5 వేల రూపాయల విలువైన బట్టలను కూడా కొని ఇవ్వాలి. ఇక తనకు ఎలాంటి ఆపద వచ్చినా అన్నివిధాలుగా రక్షణగా ఉంటానని హామీ ఇవ్వాలి అంటూ షరతు విధించింది న్యాయస్థానం. కాగా ప్రస్తుతం ఈ తీర్పు దేశవ్యాప్తంగా వైరల్‌గా మారింది. నిందితుడికి బాగా తిక్క కుదిరింది అంటూ సోషల్ మీడియాల్లో కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
Read More:
మంత్రి కేటీఆర్‌కు రాఖీ కట్టిన కవిత
ప్రియమైన సోదరీమణులందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలుః సీఎం జగన్
ప్రపంచంపై కరోనా టెర్రర్.. ఉధృతంగా పెరుగుతోన్న పాజిటివ్ కేసులు