మోడీ నియంత- గల్లా జయదేవ్

అమరావతి: రాష్ట్ర విభజనతో జరిగిన అన్యాయమే మరోసారి రైల్వే జోన్ విషయంలోనూ జరిగిందని ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. ఆదాయం వచ్చే వాల్తేరు డివిజన్‌ను ఒడిశాలో కలిపి కేవలం ఖర్చులు మాత్రమే మిగిలే విశాఖ డివిజన్‌ను ఏపీకి ఇవ్వడం దారుణమన్నారు. మోదీ రాక సందర్భంగా ఇచ్చిన పత్రికా ప్రకటనలు రైతులను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయన్నారు. ఒక రైతుకు పెట్టుబడి సాయం కింద కేంద్రం రూ.6 వేలు ఇస్తుంటే, ఎకరాకు రూ.6వేలు అన్నట్లుగా ప్రకటనలు ఇవ్వడం వారిని […]

మోడీ నియంత- గల్లా జయదేవ్

Updated on: Mar 02, 2019 | 2:38 PM

అమరావతి: రాష్ట్ర విభజనతో జరిగిన అన్యాయమే మరోసారి రైల్వే జోన్ విషయంలోనూ జరిగిందని ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. ఆదాయం వచ్చే వాల్తేరు డివిజన్‌ను ఒడిశాలో కలిపి కేవలం ఖర్చులు మాత్రమే మిగిలే విశాఖ డివిజన్‌ను ఏపీకి ఇవ్వడం దారుణమన్నారు. మోదీ రాక సందర్భంగా ఇచ్చిన పత్రికా ప్రకటనలు రైతులను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయన్నారు. ఒక రైతుకు పెట్టుబడి సాయం కింద కేంద్రం రూ.6 వేలు ఇస్తుంటే, ఎకరాకు రూ.6వేలు అన్నట్లుగా ప్రకటనలు ఇవ్వడం వారిని పక్కదారి పట్టించడమేనన్నారు. రక్షణ శాఖ మంత్రికి తెలియకుండానే పాకిస్థాన్‌పై సర్జికల్ దాడులు చేశారని, గతంలో నోట్ల రద్దు విషయంలోనూ ఆర్థికమంత్రికి తెలియకుండా చేశారని ఆరోపించారు. ఇలాంటి ప్రధాని మళ్లీ అధికారంలోకి వస్తే నియంత పోకడలు పెరిగిపోతాయన్నారు.