టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల హఠాన్మరణం.. గుండెపోటుతో మృతి.. గ్రేటర్ పోలింగ్ రోజున అధికార పార్టీలో విషాదం..

తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే, నాగార్జునసాగర్ శాసనసభ్యుడు నోముల నర్సింహయ్య హఠాన్మరణం చెందారు. అపోలో ఆసుపత్రిలో ఆయన మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తోంది.

టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల హఠాన్మరణం.. గుండెపోటుతో మృతి.. గ్రేటర్ పోలింగ్ రోజున అధికార పార్టీలో విషాదం..

Edited By:

Updated on: Dec 01, 2020 | 8:31 AM

TRS MLA Nomula sudden death: తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే, నాగార్జునసాగర్ శాసనసభ్యుడు నోముల నర్సింహయ్య హఠాన్మరణం చెందారు. చిరకాలం పాటు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) తరపున రాజకీయాల్లో పని చేసిన నోముల నర్సింహయ్య కొన్నేళ్ళ క్రితం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ.. 2018 ఎన్నికల్లో శాసనసభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన నాగార్జున సాగర్ నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా.. మంగళవారం తెల్లవారుజామున నోముల నర్సింహయ్యకు గుండెపోటు వచ్చి హఠాన్మరణం పాలైనట్లు సమాచారం.  కొద్ది నెలలుగా నోముల అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ అపోలో ఆసుపత్రితో చికిత్స పొందుతున్న నోముల.. మంగళవారం తెల్లవారుజామున మరణించారు.

నకిరేకల్ కోర్టులో న్యాయవాదిగా పని చేసిన నోముల ఆ తర్వాత అక్కడి నుంచే సీపీఎం పార్టీ తరపున శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. 1999, 2004లో సీపీఎం పార్టీ తరపున అసెంబ్లీకి ఎన్నికైన నోముల.. 2013లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2014లో నాగార్జున సాగర్ నుంచి పోటీ చేసిన నోముల.. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. తిరిగి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో జానారెడ్డిపై అనూహ్య విజయం సాధించి.. మరోసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు.