Talasani warning వైద్యుల జోలికొస్తే తాట తీస్తాం.. తలసాని మాటంటే మాటే

| Edited By: Pardhasaradhi Peri

Apr 02, 2020 | 6:52 PM

గాంధీ ఆస్పత్రిలో వైద్యులపై జరిగిన దాడి హేయమైన చర్య అని అన్నారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. వైద్యులపై ఎవరైనా దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తలసాని హెచ్చరించారు.

Talasani warning వైద్యుల జోలికొస్తే తాట తీస్తాం.. తలసాని మాటంటే మాటే
Follow us on

Talasani warns attackers: గాంధీ ఆస్పత్రిలో వైద్యులపై జరిగిన దాడి హేయమైన చర్య అని అన్నారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. వైద్యులపై ఎవరైనా దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తలసాని హెచ్చరించారు. గురువారం మంత్రి తలసాని గాంధీ ఆస్పత్రిని సందర్శించారు. వైద్యులకు సంఘీభావం ప్రకటించారు. వైద్యులతోపాటు మెడికల్ సిబ్బంది రక్షణకు భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డాక్టర్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి వైద్యం అందిస్తున్నారని, అలాంటి వైద్యులపై దాడికి పాల్పడితే తీవ్రంగా పరిగణిస్తామన్నారు. ఈ ఘటనపై వైద్యులతో మాట్లాడామని, గాంధీలో ప్రత్యేకంగా పికెట్ ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలెవరూ ఇళ్ళ నుంచి బయటకు రావొద్దన్నారు. మర్కజ్ ప్రాంతానికి వెళ్లి వచ్చిన వారిని గుర్తించామని, ఇంకా ఎవరైనా ఉంటే స్వచ్ఛందంగా ఆస్పత్రికి వచ్చి పరీక్షలు చేయించుకోవాలని మంత్రి తలసాని కోరారు.

మరోవైపు వైద్యులపై దాడిని పోలీస్ శాఖ సీరియస్ తీసుకుంది. కుత్బుల్లాపూర్ చెందిన నలుగురిపై చిలకలగూడ పిఎస్ లో కేసు నమోదు చేశారు. దాడిచేసిన పేషెంట్ తో సహా మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. వైద్యులపై దాడి నేపథ్యంలో గాంధీ ఆస్పత్రిలో పోలీసులు భద్రత పెంచారు.