Breaking News: ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీ.. ఎవరెక్కడికంటే?

|

Mar 06, 2020 | 12:57 PM

ఏపీ ప్రభుత్వం ఇరవై మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. వారిలో కొందరికి పదోన్నతులు ఇచ్చింది. మరికొందరికి స్థాన చలనం కలిగించింది. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు ఏపీ డీజీపీ గౌతమ్ సావంగ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Breaking News: ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీ.. ఎవరెక్కడికంటే?
Follow us on

AP Government transferred 20 IPS officers in the state: ఏపీ ప్రభుత్వం ఇరవై మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. వారిలో కొందరికి పదోన్నతులు ఇచ్చింది. మరికొందరికి స్థాన చలనం కలిగించింది. హోంగార్డ్ ఏడీజీగా ఉన్న హరీష్ కుమార్ గుప్తా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ చైర్మన్ బదిలీ అయ్యారు. విశాఖ సీపీ ఆర్కే మీనాకు అడిషినల్ డీజీగా పదోన్నతి కల్పించి అక్కడే విశాఖ సీపీగానే కొనసాగించారు. అలాగే విశాఖ నగర కమిషనరేట్ గ్రేడ్‌ను పెంచారు.

వెయిటింగ్‌లో ఉన్న హరికుమార్‌కు ఐజీ (లీగల్)గా పోస్టింగ్ ఇచ్చారు. ఎస్.ఐ.బీ. డీఐజీ శ్రీకాంత్‌కు ఐజీగా పదోన్నతి ఇచ్చి అదే స్ధానంలో కొనసాగించనున్నారు. ఏలూరు డీఐజీ ఏఎస్ ఖాన్‌కు ఐజీగా పదోన్నతి కల్పించారు. ఆయన్ని మెరైన్ ఐజీగా బదిలీ చేశారు. సీఐడీ డీఐజీ ప్రబాకర్ రావుకు ఐజీగా పదోన్నతి ఇస్తూ గుంటూరు రేంజ్‌కు బదిలీ చేశారు. గుంటూరు ఐజీ వినిత్ బ్రిజ్ లాల్‌ను శాండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు బదిలీ చేస్తూ అదనంగా ఎక్సైజ్ ప్రొహిబిషన్ బాద్యతలు అప్పగించారు.

విజయవాడ జాయింట్ సీపీ నాగేంద్రకుమార్‌ను పదోన్నతిపై ఐజీ పీ&ఎల్‌కు బదిలీ చేశారు. సీఐసెల్ ఎస్పీ కే .రఘరామరెడ్డికి డీఐజీగా పదోన్నతి ఇచ్చి అదే స్ధానంలో కొనసాగించబోతున్నారు. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ అశోక్ కుమార్‌కు డీఐజీగా పదోన్నతి ఇచ్చి అదే స్ధానంలో కొనసాగించనున్నారు. ఇంటిజిలెన్స్ ఎస్పీ జీ.విజయ్ కుమార్‌కు డీఐజీగా పదోన్నతి లభించింది. ఆయన కూడా అదే స్థానంలో కొనసాగుతారు.

విజయవాడ డీసీపీ (అడ్మిన్) హరికృష్ణకు డీఐజీగా పదోన్నతి ఇచ్చి సీఐడీకు బదిలీ చేశారు. ఎస్.ఐ.బీ. ఎస్పీ రవిప్రకాశ్‌కు డీఐజిగా పదోన్నతి ఇచ్చి ఏసీబీకి బదిలీ చేశారు. రాజశేఖర్ బాబుకు డీఐజీగా పదోన్నతి కల్పిస్తూ హెడ్ క్వార్టర్స్ లా & ఆర్టర్ కోఆర్డినేటర్‌గా నియమించారు. ఇంటిలిజెన్స్ ఎస్పీ కే.వి మోహన్ రావు డీఐజీగా పదోన్నతి ఇచ్చి ఏలూరు రేంజ్ డీఐజీగా బదిలీ చేశారు. గుంటూరు ఎస్పీ పీహెచ్ డీ రామకృష్ణకు డీఐజిగా పదోన్నతి ఇచ్చి అక్కడే కొనసాగించబోతున్నారు.

పార్వతిపురం ఏఎస్పి గరుడ్ స్మిత్ సునీల్‌ను నర్సీపట్నం ఓఎస్డీగా ట్రాన్స్‌ఫర్ చేశారు. వెకెన్సీలో ఉన్న బీ కృష్ణారావును ఏపీఎస్పీ 6 వ బెటాలియన్ కామాండెంట్‌గా నియమించారు. చింతూరు ఓఎస్డీగా ఉన్న అమిత్ బర్డార్‌ను కాకినాడ మూడో బెటాలియన్ కామాండెంట్‌గా బదిలీ చేశారు. బొబ్బిలి ఎఎస్పీగా గౌతమి సాలి కర్నూలు అడిషనల్ ఎస్పీ (అడ్మిన్)గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యారు.