మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించండి.. నారాయణ్ రాణే డిమాండ్

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ ఎంపీ నారాయణ్‌ రాణే రాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోష్యారీతో సోమవారం రాజ్‌భవన్‌లో సమావేశమయ్యారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్‌ను కోరారు. కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రాణే ఆరోపించారు. మహారాష్ట్రలో అత్యధిక కేసులు, మరణాలు నమోదవుతున్నాయని గుర్తు చేశారు. భవిష్యత్‌లోనూ కరోనా మహమ్మారిని ప్రస్తుత ప్రభుత్వం కట్టడి చేయలేదని అన్నారు. కరోనా కట్టడిలో ఠాక్రే సర్కార్ కరోనా నియంత్రించడంలో పూర్తిగా […]

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించండి.. నారాయణ్ రాణే డిమాండ్

Edited By:

Updated on: May 25, 2020 | 10:14 PM

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ ఎంపీ నారాయణ్‌ రాణే రాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోష్యారీతో సోమవారం రాజ్‌భవన్‌లో సమావేశమయ్యారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్‌ను కోరారు. కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రాణే ఆరోపించారు. మహారాష్ట్రలో అత్యధిక కేసులు, మరణాలు నమోదవుతున్నాయని గుర్తు చేశారు. భవిష్యత్‌లోనూ కరోనా మహమ్మారిని ప్రస్తుత ప్రభుత్వం కట్టడి చేయలేదని అన్నారు. కరోనా కట్టడిలో ఠాక్రే సర్కార్ కరోనా నియంత్రించడంలో పూర్తిగా విఫలమైందని రాణే మండిపడ్డారు.
కరోనా వైరస్‌ సంక్షోభంపై చర్చించేందుకు గత కొద్దిరోజులుగా బీజేపీ నేతలు గవర్నర్‌తో భేటీ అవడం ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ సైతం ఇటీవల గవర్నర్‌తో సమావేశమై కరోనా కట్టడి సహా పలు అంశాలపై చర్చించారు. ఇక మహారాష్ట్రలో ఇప్పటివరకూ 50,231 కరోనా కేసులు నమోదవగా 1635 మంది మరణించారు. దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలోనే ఉండడం విశేషం.