మధ్యప్రదేశ్: శానిటేషన్ వర్కర్ దుస్తులు చించి.. దాడి

మధ్యప్రదేశ్ లోని దేవాస్ జిల్లాలో జరిగింది ఓ దారుణం.. కరోనా నేపథ్యంలో వీధులను శానిటైజ్ చేయడానికి వెళ్లిన ఓ వర్కర్ పై స్థానికులు దాడి చేసి అతని దుస్తులు చించివేశారు. మరో వర్కర్ పై గొడ్డలితో దాడి చేయగా అతని చేతికి తీవ్ర గాయమైంది.

మధ్యప్రదేశ్: శానిటేషన్ వర్కర్ దుస్తులు చించి.. దాడి

Edited By:

Updated on: Apr 18, 2020 | 2:51 PM

మధ్యప్రదేశ్ లోని దేవాస్ జిల్లాలో జరిగింది ఓ దారుణం.. కరోనా నేపథ్యంలో వీధులను శానిటైజ్ చేయడానికి వెళ్లిన ఓ వర్కర్ పై స్థానికులు దాడి చేసి అతని దుస్తులు చించివేశారు. మరో వర్కర్ పై గొడ్డలితో దాడి చేయగా అతని చేతికి తీవ్ర గాయమైంది. ఈ ఘటనలో బాధితుడిని వారు కర్రలతో కొట్టుకుంటూ వెంటబడి తరిమారు. కొందరు అతని చొక్కాను చించివేశారు. ఆ వర్కర్ పట్ల రాక్షసంగా ప్రవర్తించారు. ఈ ఘటనలో ఈ గుంపులోని అదిల్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పారిపోయిన అతని సోదరుని కోసం గాలిస్తున్నారు. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో శానిటైజేషన్ కార్మికులపైనా, అధికారులపైనా స్థానికులు దాడులు చేస్తున్న సంఘటనలు పెరిగిపోతున్నాయి. ఇండోర్ లో కరోనా వైరస్ ఛాయలు ‘కనబడిన’ వ్యక్తుల స్క్రీనింగ్ కోసం వెళ్లిన వర్కర్స్ పై, అధికారులపై లోకల్స్ తీవ్రంగా దాడికి పాల్పడ్డారు. ఆ ఘటనలో ఇద్దరు మహిళా డాక్టర్లకు గాయాలయ్యాయి. పోలీసులు వఛ్చి వారిని రక్షించారు. భోపాల్ లో లాక్ డౌన్ విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్ పై కొందరు రాళ్లతో ఎటాక్ చేశారు. మధ్యప్రదేశ్ లో 1310 కరోనా కేసులు నమోదు కాగా.. 69 మంది కరోనా రోగులు మరణించారు.

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us