‘కరోనాపై పోరుకు లాక్ డౌన్ పరిష్కారం కాదు.. రాహుల్ గాంధీ

| Edited By: Anil kumar poka

Apr 16, 2020 | 2:11 PM

కరోనాపై పోరాటానికి లాక్ డౌన్ విధింపు పరిష్కారం కాదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రభుత్వం మొదట టెస్టింగ్ ప్రక్రియను పెద్ద ఎత్తున చేపట్టాలని ఆయన సూచించారు. ఈ ప్రక్రియను ముమ్మరం చేస్తేనే ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేయగలుతామని చెప్పారు.

కరోనాపై పోరుకు లాక్ డౌన్ పరిష్కారం కాదు.. రాహుల్ గాంధీ
Follow us on

కరోనాపై పోరాటానికి లాక్ డౌన్ విధింపు పరిష్కారం కాదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రభుత్వం మొదట టెస్టింగ్ ప్రక్రియను పెద్ద ఎత్తున చేపట్టాలని ఆయన సూచించారు. ఈ ప్రక్రియను ముమ్మరం చేస్తేనే ఈ మహమ్మారికి అడ్డుకట్ట వేయగలుతామని చెప్పారు. ఎలా చూసినా ఈ వైరస్ ను తరిమి కొట్టజాలమని, లాక్ డౌన్ విధిస్తే కొద్దికాలం మాత్రం ఆపగలుగుతామని ఆయన పేర్కొన్నారు. టెస్టింగ్ తప్పనిసరి అంటూ ఓ వీడియో యాప్ ద్వారా మీడియాతో కాంటాక్ట్ అయ్యారు రాహుల్. ఈ వైరస్ ను ప్రభుత్వం తరుముతోంది.. కానీ దీని అసలైన లక్షణాలు మనకు అవగతం కావడంలేదు అని అన్నారు. దేశంలో ప్రస్తుతం టెస్టింగ్ లెవెల్ చాలా తక్కువ స్థాయిలో ఉందని, ఈ స్థాయిని వ్యూహాత్మకంగా పెంచాలని ఆయన సలహా ఇచ్చారు.