లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఈ ఆదివారం ఆరో విడత పోలింగ్ జరగనుంది. ఈ దశలో ఆరు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో మొత్తం 59 స్థానాలకు పోలింగ్ జరగనుండగా.. ఇవాళ్టితో ప్రచారం ముగియనుంది. దీంతో ఆయా పార్టీల అగ్రనేతలు పోలింగ్ జరిగే రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీజేపీ చీఫ్ అమిత్ షా, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీలు విరామం లేకుండా వరుస ర్యాలీలలో పాల్గొంటున్నారు.