‘ఆ’ భవనాలను ఖాళీ చేయించండి: కేటీఆర్ ఆదేశం

|

Oct 12, 2020 | 2:53 PM

హైదరాబాద్ పాతబస్తీలో పాత భవనమొకటి కూలి ప్రాణనష్టం జరిగిన దరిమిలా మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి కే. తారక రామారావు జీహెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేశారు.

‘ఆ’ భవనాలను ఖాళీ చేయించండి: కేటీఆర్ ఆదేశం
Follow us on

KTR orders vacation of old buildings: హైదరాబాద్ పాతబస్తీలో పాత భవనమొకటి కూలి ప్రాణనష్టం జరిగిన దరిమిలా మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి కే. తారక రామారావు జీహెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేశారు. భారీ వర్షాలకు అవకాశముందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జంటనగరాల పరిధిలో మరీ ముఖ్యంగా పాతబస్తీలో పాత భవనాలలో నివస్తున్న ప్రజలను తక్షణం ఖాళీ చేయించాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు.

జంట నగరాల పరిధిలో శిథిలావస్థకు చేరిన అన్ని భవనాలకు నోటీసులు జారీచేయాలని ఆయన జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. అటువంటి భవనాలలో నివసిస్తున్న వారిని తక్షణం ఖాళీ చేయించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నందున హై-అలర్ట్‌గా వుండాలని అసిస్టెంట్ సిటీ ప్లాన్నర్లు, టౌన్ ప్లానింగ్ సిబ్బందిని మంత్రి కేటీఆర్ నిర్దేశించారు.

ఇదిలా వుండగా.. ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో హైదరాబాద్ హుస్సేనీ ఆలంలో వందేళ్ళ నాటి పాత భవనం కుప్పకూలిన ఘటనలో ఇద్దరు మరణించారు. వీరిలో 19 ఏళ్ళ అనిషాకు అక్టోబర్ 19వ తేదీన వివాహం జరగాల్సి వుంది. పెళ్ళి ఏర్పాట్లలో భాగంగా కుటుంబ సభ్యలంతా ఇంటిలో వుండగా భవనం కూలిపోయింది. ఇద్దరు మరణించగా.. మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

Also read: కమలదళంలోకి ఖుష్బూ

Also read: ఉద్యోగులకు టీటీడీ బ్రహ్మోత్సవ కానుక