
Kiccha Sudeep Adopts 4 Government Schools in Karnataka : కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ తన ఫ్యూచర్ ప్లాన్ ను పక్కాగా అములు చేసుకుంటూ వెళ్తున్నారు.
తన నటనతో కన్నడ, తెలుగు, తమిళ, బాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించాడు. సినిమాల ద్వారా స్టార్ హీరో అనిపించుకన్న ఈ యాక్షన్ కింగ్.. ఇప్పుడు ప్రజల మనసులను దోచుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇంత వరకు రీల్ హీరో అనిపించుకున్న సుదీప్..ఇపుడు రియల్ హీరో అనిపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాల్లో తన ప్లాన్ ను ఇంప్లిమెంట్ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. తన ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రభుత్వం పాఠశాలలను సుదీప్ దత్తత తీసుకున్నారు. ఇందులో భాగంగా నాలుగు ప్రభుత్వ పాఠశాలలను చిత్రదుర్గ జిల్లా నుంచి ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేలా స్కాలర్ షిప్ అందించడంతోపాటు వారికి డిజిటల్ క్లాస్ రూంలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు వాలంటీర్స్ టీంతో కలిసి ప్లాన్ చేశాడు.