
కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసు నిందితుల నుంచి బెదిరింపులు వస్తున్నాయంటూ గన్‌మెన్ ఆత్మహత్యాయత్నం చేశాడు. తిరువనంతపురంలోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయబార కార్యాలయం గన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్న జయఘోష్ గత రెండు రోజులుగా కనిపించకుండా పోయాడు. దీంతో కుటుంబసభ్యలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, గోల్డ్ స్మగ్లింగ్ కేసు నిందితుల నుంచి బెదిరింపులు రావడంతో అతడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
కాగా, శుక్రవారం తన ఇంటి సమీపంలోని ఓ గోడ పక్కన రక్తపు మడుగులో అపస్మారక స్థితిలో పడి ఉన్న జయఘోష్ ను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అతడిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. జయఘోష్ గోడపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇదిలావుంటే, తిరువనంతపురంలోని యూఏఈ దౌత్య కార్యాలయం అధికారి పేరుతో దొంగ బంగారం వస్తున్నట్లు జయఘోషే కస్టమ్స్ అధికారులకు సమాచారం ఇచ్చాడని నిందుతులు అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే నిందుతుల తరఫు మనుషులు అతడిని బెదిరిస్తున్నారని అతని కుటుంబసభ్యలు చెబుతున్నారు. దీంతో జయఘోష్ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపడుతున్నామన్నారు.
#KeralaGoldSmugglingScam becoming murkier. The missing Gunman of UAE consulate was found today with a cut on his hand hinting a possible suicide attempt.
Yesterday, out of public pressure, Pinarayi was forced to suspend his Principal Sec’y for his involvement in gold smuggling pic.twitter.com/z2b22OV766
— നചികേതസ് (@nach1keta) July 17, 2020