కేసీఆర్ మరో షాకింగ్ డెసిషన్… ఇక రాష్ట్రంలో అది కంపల్సరీ

|

Apr 10, 2020 | 3:18 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. కరోనా కట్టడికి, మునుముందు మరే పెద్ద ముప్పు రాకుండా వుండేందుకు తాజా నిర్ణయం ఉపయోగపడుతుందని ప్రభుత్వ వర్గాలంటున్నాయి.

కేసీఆర్ మరో షాకింగ్ డెసిషన్... ఇక రాష్ట్రంలో అది కంపల్సరీ
Follow us on

KCR has taken one more shocking decision: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. కరోనా కట్టడికి, మునుముందు మరే పెద్ద ముప్పు రాకుండా వుండేందుకు తాజా నిర్ణయం ఉపయోగపడుతుందని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. రెండు రోజుల క్రితం బహిరంగంగా ఉమ్మి వేస్తే శిక్షార్హులను చేయగా.. తాజాగా మరో నిబంధనతో కరోనాపై యుద్ధం ప్రకటించారు తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు.

రాష్ట్రంలో కరోనా వైరస్‌ ప్రభావం నేపథ్యంలో మాస్కుల వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీచేసింది. ఇళ్ల నుంచి బయటకు వస్తే తప్పకుండా మాస్కులు ధరించాలని ఆదేశించింది. చాలా మందిలో కరోనా సోకినా లక్షణాలు ఉండటంలేదని అధ్యయనంలో వెల్లడి కావడంతో మాస్కుల వినియోగాన్ని తప్పనిసరి చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. లాక్ డౌన్ ఎత్తివేసినా.. కొనసాగించినా మరో రెండు, మూడు నెలల ఏదో ఒక రకంగా కరోనా వైరస్ ప్రభావం వుండే అవకాశాలుండడంతో సీఎం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

దేశంలో ప్రజలంతా మాస్కులు ధరించాల్సిన అవసరం వుందని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే మాండేటరీ మాత్రం చేయలేదు. కానీ కొన్ని రాష్ట్రాలు.. మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, ఒడిషా ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో మాస్కుల ధారణ కంపల్సరీ చేశాయి. చండిఘడ్, ఢిల్లీ నగరాల్లోను స్థానిక పాలక సంస్థలు మాస్కుల ధారణను మాండేటరీ చేశాయి. ఈ క్రమంలో తెలంగాణలోను మాస్కుల ధారణ మస్ట్ చేస్తూ కేసీఆర్ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.