బ్రేకింగ్ : కర్నాటక స్పీకర్ సంచలన నిర్ణయం

| Edited By:

Jul 25, 2019 | 9:25 PM

కర్నాటక రాజకీయంలో ఇవాళ మరో సంచలనం చోటుచేసుకుంది. స్పీకర్ రమేశ్‌కుమార్ ముగ్గురు రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. స్వతంత్ర ఎమ్మెల్యే ఆర్‌.శంకర్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు జర్కిహోళి, మహేశ్‌ కుమటహళ్లిలను అనర్హులుగా ప్రకటించారు. జేడీఎస్ కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోడానికి కారణమైన 15 మంది రెబల్ ఎమ్మెల్యేలు ఇప్పటికీ అసలైన కారణాన్ని వెల్లడించలేదు. అయితే స్పీకర్ తీసుకున్న తాజా నిర్ణయం తర్వాత మిగిలినవారిపై చర్యలు తీసుకుంటారని భావిస్తున్నారు. స్వతంత్ర ఎమ్మెల్యే ఆర్. శంకర్‌తో సహా ముగ్గురిపై 2023 […]

బ్రేకింగ్ : కర్నాటక స్పీకర్ సంచలన నిర్ణయం
Follow us on

కర్నాటక రాజకీయంలో ఇవాళ మరో సంచలనం చోటుచేసుకుంది. స్పీకర్ రమేశ్‌కుమార్ ముగ్గురు రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. స్వతంత్ర ఎమ్మెల్యే ఆర్‌.శంకర్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు జర్కిహోళి, మహేశ్‌ కుమటహళ్లిలను అనర్హులుగా ప్రకటించారు. జేడీఎస్ కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోడానికి కారణమైన 15 మంది రెబల్ ఎమ్మెల్యేలు ఇప్పటికీ అసలైన కారణాన్ని వెల్లడించలేదు.

అయితే స్పీకర్ తీసుకున్న తాజా నిర్ణయం తర్వాత మిగిలినవారిపై చర్యలు తీసుకుంటారని భావిస్తున్నారు. స్వతంత్ర ఎమ్మెల్యే ఆర్. శంకర్‌తో సహా ముగ్గురిపై 2023 వరకు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేశారు. కాంగ్రెస్‌-జేడీఎస్‌ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా ముఖ్యమంత్రి కుమారస్వామి పనితీరుకు వ్యతిరేకంగా రెండు పార్టీల నుంచి ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు.