
హైదరాబాద్ : ఎమ్మెల్యే కోటాలో శాసనమండలి అభ్యర్థిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆ పార్టీ బీసీ సంఘం అధ్యయన కమిటీ ఛైర్మన్ జంగా కృష్ణామూర్తి బీ ఫారం అందుకున్నారు. పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గురువారం జంగా కృష్ణమూర్తికి బీ ఫారం అందచేశారు. ఈ నెల 25న ఆయన అమరావతిలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. మరోవైపు శాసనమండలి ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్ విడుదలైంది.
ఫిబ్రవరి 21 నుంచి నామినేసన్లు స్వీకరించనుండగా… ఫిబ్రవరి 28తో స్వీకరణ గడువు ముగియనుంది. నామినేషన్ల పరిశీలన మార్చి 1న చేపట్టనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా మార్చి 5 ను నిర్ణయించారు. పోలింగ్ మార్చి 12 జరగనుండగా అదే రోజు ఓట్ల లెక్కింపు చేసి విజేతలను ప్రకటిస్తారు. ఎన్నికల ప్రక్రియ మార్చి 15న ముగియనుంది.