YS Jagan has given big shockk to internet users: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏపీలో ఇంటర్నెట్ కనెక్షన్ కోసం ఫైబర్ నెట్ వాడుతున్న వారికి పెద్ద షాకిచ్చారు. ఫైబర్ నెట్ కనెక్షన్ ఛార్జీలను భారీగా పెంచారు. తద్వారా ప్రభుత్వంపై పడుతున్న భారాన్ని గణనీయంగా తగ్గించేందుకు చర్యలు తీసుకున్నారు ఏపీ ముఖ్యమంత్రి.
గురువారం రాష్ట్రంలోని ఫైబర్ నెట్ వినియోగదారులకు చేదు వార్త చేరింది. ఫైబర్ నెట్ కనెక్షన్ ఛార్జీలను జగన్ ప్రభుత్వం భారీగా పెంచేసింది. ఒక్కో కనెక్షనుకు 55 రూపాయల మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఛార్జీల పెంపు అనంతరం పన్నులు మినహా నెలవారీ ఛార్జీ కనెక్షన్ ఛార్జీ 204 రూపాయలకు చేరింది. ఒక్కో పైబర్ నెట్ కనెక్షనుకు 230 రూపాయల మేర ప్రభుత్వం భారాన్ని మోస్తూ వచ్చింది ఇంతకాలం.
రాష్ట్రంలో మొత్తం 8 లక్షల 30వేలకు పైచిలుకు ఫైబర్‌నెట్ కనెక్షన్లున్నాయి. వీటిపై సబ్సిడీని ప్రభుత్వం భరిస్తున్న నేపథ్యంలో నెలకు 13 కోట్ల రూపాయల వరకు భారం పడుతోంది. ఈ భారాన్ని తగ్గించుకునేందుకు ఫైబర్‌నెట్ ఛార్జీలను పెంచడమే మార్గమని ప్రభుత్వం భావించింది. దాంతో కనెక్షన్‌కు 55 రూపాయల మేరకు ఛార్జీలను పెంచేసింది. దీంతో వినియోగదారులపై అదనపు భారం పడనుండగా.. ప్రభుత్వంపై భారం నెలకు మూడు కోట్ల రూపాయల మేరకు తగ్గనున్నది.