Jagan good news కరోనాపై గుడ్ న్యూస్ చెప్పిన జగన్

|

Apr 10, 2020 | 1:15 PM

ఏపీలో కరోనా వ్యాప్తి, తాజా పరిణామాలపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. కరోనా నియంత్రణా చర్యలు, తాజా పరిణామాలు, లాక్ డౌన్ పరిస్థితులపై జగన్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్సులోనే సీఎం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Jagan good news కరోనాపై గుడ్ న్యూస్ చెప్పిన జగన్
Follow us on

Jagan good news ఏపీలో కరోనా వ్యాప్తి, తాజా పరిణామాలపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. కరోనా నియంత్రణా చర్యలు, తాజా పరిణామాలు, లాక్ డౌన్ పరిస్థితులపై జగన్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. కరోనా నియంత్రణా చర్యల్లో నిమగ్నమైన జిల్లా కలెక్టర్లు, కోవిడ్‌ ఆస్పత్రుల వైద్యులు ఈ వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మీద యుద్ధంలో కలెక్టర్లు, వైద్య వర్గాలు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని సీఎం వారిని ప్రశంసించారు.

కలెక్టర్లు, వైద్యులు చాలా ఎక్కువగా కష్టపడుతున్నారని, చక్కని సర్వీసు ఇస్తున్నారని జగన్ వ్యాఖ్యానించారు. వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది, నర్సులు, పారిశుద్ధ్య సిబ్బంది హృదయపూర్వకంగా సేవలు అందిస్తున్నారని అన్నారు. రాష్ట్రానికి సంబంధించి నాలుగు క్రిటికల్‌ కేర్‌ ఆస్పత్రుల్లో ఉత్తమ వైద్య సేవలను అందించడానికి గుర్తించామని చెప్పారు సీఎం. జిల్లాల్లోని కోవిడ్‌ ఆస్పత్రులు, అలాగే క్రిటికల్‌ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా వైద్యసేవలు అందించే క్రమంలో రిస్కు ఉంటుందని తెలిసినప్పటికీ చాలా కష్టపడి ఈ సేవ చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

ఢిల్లీ నుంచి వచ్చిన వారి కారణంగా రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిందని అన్నారు సీఎం జగన్. వారందర్ని ట్రేస్‌ చేసి వారి ప్రైమరీ కాంటాక్ట్స్‌ను, సెకండరీ కాంటాక్ట్స్‌ను పూర్తి క్వారంటైన్‌‌లో లేదా ఐసోలేషన్‌లో పెట్టామని చెప్పారాయన. మొత్తంగా చూస్తే ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పుకోవచ్చని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం ద్వారా రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. రాబోయే రోజుల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని నమ్ముతున్నానని జగన్ అన్నారు.