అభినందన్‌పై పాక్ ఏదైనా ప్రయోగం చేసిందా?

న్యూఢిల్లీ: భారత ఫైటర్ పైలట్ అభినందన్ మరికాసేపట్లో స్వదేశానికి చేరుకోనున్నారు. వాఘా బోర్డర్ వద్ద ఆయనను పాకిస్థాన్ మనకు అప్పగించే అవకాశాలున్నాయి. అయితే అభినందన్‌ రాగానే ముందుగా భారత్ ఏం చేయబోతుందో తెలుసా? వైద్య పరీక్షలు. అవును అభినందన్‌కు క్షుణ్ణంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. పాక్ అందించే వైద్య నివేదికకు మన వైద్యులు పరీక్షించి ఇచ్చే వైద్య నివేదిక సరిపోలుతుందా లేదా? అనేది చెక్ చేస్తారు. అభినందన్ శరీరం మొత్తాన్ని క్షుణ్ణంగా పరీక్షిస్తారు. ఆయన మీద ఏదైనా […]

అభినందన్‌పై పాక్ ఏదైనా ప్రయోగం చేసిందా?

Updated on: Mar 01, 2019 | 2:48 PM

న్యూఢిల్లీ: భారత ఫైటర్ పైలట్ అభినందన్ మరికాసేపట్లో స్వదేశానికి చేరుకోనున్నారు. వాఘా బోర్డర్ వద్ద ఆయనను పాకిస్థాన్ మనకు అప్పగించే అవకాశాలున్నాయి. అయితే అభినందన్‌ రాగానే ముందుగా భారత్ ఏం చేయబోతుందో తెలుసా? వైద్య పరీక్షలు. అవును అభినందన్‌కు క్షుణ్ణంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.

పాక్ అందించే వైద్య నివేదికకు మన వైద్యులు పరీక్షించి ఇచ్చే వైద్య నివేదిక సరిపోలుతుందా లేదా? అనేది చెక్ చేస్తారు. అభినందన్ శరీరం మొత్తాన్ని క్షుణ్ణంగా పరీక్షిస్తారు. ఆయన మీద ఏదైనా ప్రయోగం చేశారా అనే కోణంలో కూడా వైద్యులు చెక్ చేయనున్నారు.

అంతా బాగానే ఉంది అనుకునే వరకు ఈ వైద్య పరీక్షలుంటాయి. అంతేకాకుండా అక్కడ పాక్ ఆర్మీ ఎలాంటి ప్రశ్నలు అడిగింది? ఏమైనా హింసించారా? వంటి వివరాలను పూర్తిగా అడిగి తెలుసుకుంటారు. అభినందన్ నడిపిన మిగ్-21 నుంచి ప్యారాచూట్ సాయంతో కిందకు ఎందుకు దూకడానికి దారి తీసిన పరిణామాల మొదలు భారత్‌కు తిరుగి వచ్చిన వరకు జరిగిన అన్ని విషయాలను సవివరంగా తెలుసుకుంటారు. ఈ వివరాలన్నింటి ఆధారంగా వాయుసేన ఒక ప్రత్యేక రిపోర్ట్ తయారు చేసి భారత ప్రభుత్వానికి సమర్పించనుంది.