భారత నేవీ కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ గూఢచర్యంతో నేవీ అధికారులు అలెర్ట్ అయ్యారు. స్మార్ట్ ఫోన్లు, ఫేస్‌బుక్ వాడకాన్ని నిషేధిస్తూ అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అలాగే నేవీ స్థావరాలు, డాక్ యార్డు, ఆన్‌బోర్డు యుద్ధనౌకల దగ్గర నిషేధాజ్ఞలు అమలు చేశారు అధికారులు. ఇటీవల సోషల్ మీడియా ద్వారా సమాచారాన్ని లీక్ చేస్తోన్న.. ఏడుగురు నేవీ ఇబ్బంది అరెస్ట్ అనంతరం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
భారత్ రక్షణ విభాగానికి సంబంధించిన కీలక సమాచారాన్ని పాక్‌కు చేరవేసే వ్యక్తులను ఈ నెల 20వ తేదీన అరెస్ట్ చేశారు నేవీ సిబ్బంది. గత నెల రోజులుగా చేపట్టిన ఆపరేషన్ డాల్ఫిన్ నోస్‌లో భాగంగా నిందితులు చిక్కారు. వీరిని విజయవాడ ఎన్‌ఐఏ కోర్టులో అధికారులు హాజరుపరిచారు. జనవరి 3వ తేదీ వరకూ కోర్టు వీరికి రిమాండ్ విధించింది. ఏపీ ఇంటెలిజెన్స్, కేంద్ర నిఘావర్గాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను జరిపాయి. ఇందులో ఏడుగురు నేవీ సిబ్బంది, ఒక హవాలా వ్యక్తిని అరెస్ట్ చేశారు.