కీసరగుట్టలో గుప్తనిధులు..!

మేడ్చల్‌జిల్లా కీసరగుట్టలో గుప్తనిధుల తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. గుట్టపై రాత్రి వేళల్లో కొందరు గుర్తుతెలియని దుండగులు తవ్వకాలు జరిపారు. కొబ్బరికాయలు కొట్టి, నిమ్మకాయలతో క్షూద్ర పూజలు చేసి గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపినట్టు ఆనవాలు కనిపిస్తున్నాయి‌.

కీసరగుట్టలో గుప్తనిధులు..!

Updated on: Sep 03, 2020 | 6:09 PM

మేడ్చల్‌జిల్లా కీసరగుట్టలో గుప్తనిధుల తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. గుట్టపై రాత్రి వేళల్లో కొందరు గుర్తుతెలియని దుండగులు తవ్వకాలు జరిపారు. కొబ్బరికాయలు కొట్టి, నిమ్మకాయలతో క్షూద్ర పూజలు చేశారు. గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపినట్టు ఆనవాలు కనిపిస్తున్నాయి‌.

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనతో పోలీస్ అధికారులు అప్రమత్తమయ్యారు. గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపిన దుండగుల కోసం గాలిస్తున్నారు. అయితే పవిత్ర పుణ్యక్షేత్రంలో తవ్వకాలు జరపడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారిపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us