స్టాక్ మార్కెట్ లో భారీ పతనం

| Edited By: Team Veegam

Sep 15, 2020 | 8:16 PM

స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోకి కుంగిపోయాయి. శుక్రవారం నాడు వచ్చిన లాభాలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. సెన్సెక్స్‌ వెయ్యి పాయింట్లు, నిఫ్టీ 300 పాయింట్లకు పైగా నష్టపోయాయి.

స్టాక్ మార్కెట్ లో భారీ పతనం
Follow us on

స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లోకి కుంగిపోయాయి. శుక్రవారం నాడు వచ్చిన లాభాలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. సెన్సెక్స్‌ వెయ్యి పాయింట్లు, నిఫ్టీ 300 పాయింట్లకు పైగా నష్టపోయాయి. భారత్‌ చైనా సరిహద్దు వివాదం నేపథ్యంలో.. మార్కెట్లలో భారీ కుదుపు వచ్చింది.

చైనాతో మళ్లీ ఘర్షణ జరిగిందన్న వార్త మదుపర్లను ఉలికిపాటుకు గురి చేసింది. దీంతో లాక్ డౌన్ సడలింపులు, ఆర్బీఐ నుంచి సానుకూల స్పందనల నేపథ్యంలో ఉదయంపూట లాభాల్లో దూసుకెళ్లిన సూచీలు ఒక్కసారిగా కుప్పకూలాయి.

గల్వాన్‌ వివాదంతోపాటు.. జీ20 దేశాల్లో అత్యల్ప వృద్ధిరేటు భారత్ లో నమోదు కానుందన్న ఆర్థిక నిపుణుల అంచనా మరింత కలవరానికి గురి చేసింది. దాంతో తొమ్మిది రంగాల్లో షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.