రహస్య డేటా బయటకెలా వెళ్లింది?: బుగ్గన

హైదరాబాద్: రహస్యంగా ఉండాల్సిన డేటా బయటకెలా వెళ్లిందని వైసీపీ నాయకుడు బుగ్గన రాజేద్ర ప్రసాద్ ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని వైసీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ ఓటర్లను నాలుగు భాగాలుగా విభజించి టీడీపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. కోట్లాది మంది ఏపీ ప్రజల సమాచారం ఆధార్ నంబర్ సహా బయటకు వెళ్లిపోయిందని ఆరోపించారు. ఇది చాలా ప్రమాదకరమైన విషయమని వ్యాఖ్యానించారు. బ్లూ ఫ్రాగ్, ఐటీ గ్రిడ్ కంపెనీల ఓనర్లు ఎప్పుడు […]

రహస్య డేటా బయటకెలా వెళ్లింది?: బుగ్గన

Updated on: Mar 04, 2019 | 3:15 PM

హైదరాబాద్: రహస్యంగా ఉండాల్సిన డేటా బయటకెలా వెళ్లిందని వైసీపీ నాయకుడు బుగ్గన రాజేద్ర ప్రసాద్ ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని వైసీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ ఓటర్లను నాలుగు భాగాలుగా విభజించి టీడీపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు.

కోట్లాది మంది ఏపీ ప్రజల సమాచారం ఆధార్ నంబర్ సహా బయటకు వెళ్లిపోయిందని ఆరోపించారు. ఇది చాలా ప్రమాదకరమైన విషయమని వ్యాఖ్యానించారు. బ్లూ ఫ్రాగ్, ఐటీ గ్రిడ్ కంపెనీల ఓనర్లు ఎప్పుడు చూసినా చంద్రబాబు వెంటే ఉంటారని దుయ్యబట్టారు.

ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని టీడీపీ నేతలు ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకుంటున్నారని అన్నారు. తప్పులేనప్పుడు చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ కు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా ఓటర్ల జాబితాను సేకరించారని బుగ్గన ఆరోపించారు.