కేసీఆర్ సర్కార్‌కు హైకోర్టు షాక్

|

Apr 22, 2020 | 3:32 PM

తెలంగాణ హైకోర్టు కేసీఆర్ ప్రభుత్వానికి షాకిచ్చింది. కరోనా పరీక్షలు, కేసులు, లాక్ డౌన్ చర్యలు సహా మొత్తం నివేదికను తమకు సమర్పించాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. తిరుమల రావు అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై...

కేసీఆర్ సర్కార్‌కు హైకోర్టు షాక్
Follow us on

తెలంగాణ హైకోర్టు కేసీఆర్ ప్రభుత్వానికి షాకిచ్చింది. కరోనా పరీక్షలు, కేసులు, లాక్ డౌన్ చర్యలు సహా మొత్తం నివేదికను తమకు సమర్పించాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. తిరుమల రావు అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

కరోనా పరీక్షలపై నివేదిక సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. తిరుమలరావు అనే వ్యక్తి పిటిషన్ మీద వీడియో కన్ఫరెన్స్ ద్వారా హైకోర్టు విచారణ జరిపింది. కరోనా పరీక్షలు ఎవరికి చేస్తున్నారో మే 13లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అలాగే దివ్యాంగులకు, వారి సహాయకులకు పాస్‌లు ఇవ్వాలని సూచించింది హై కోర్టు. వీరి కోసం ప్రత్యేకంగా టోల్‌ ఫ్రీ నంబర్లను విస్తృతంగా ప్రజల్లో ప్రచారం చేయాలని హైకోర్టు సూచన చేసింది. కరోనా వైరస్ నియంత్రణకు ఏం చర్యలు తీసుకున్నారో మే 8వ తేదీలోపు నివేదిక సమర్పించాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలిచ్చింది.