High Alert శంషాబాద్ ఎయిర్‌పోర్టులో హై అలర్ట్.. లేటెస్ట్ అప్‌డేట్

|

Mar 18, 2020 | 6:24 PM

కరోనా ప్రభావంతో ప్రపంచం వణికిపోతున్న తరుణంలో విమానాశ్రయాల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. తాజాగా హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో హై అలర్ట్ ప్రకటించారు. విదేశాల నుంచి వస్తున్న ప్రయాణీకులను మరింత క్షుణ్ణంగా పరిశీలించేందుకు ఏర్పాట్లు చేశారు.

High Alert శంషాబాద్ ఎయిర్‌పోర్టులో హై అలర్ట్.. లేటెస్ట్ అప్‌డేట్
Follow us on

Airport authorities declared high alert in Shamsabad airport: కరోనా ప్రభావంతో ప్రపంచం వణికిపోతున్న తరుణంలో విమానాశ్రయాల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. తాజాగా హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో హై అలర్ట్ ప్రకటించారు. విదేశాల నుంచి వస్తున్న ప్రయాణీకులను మరింత క్షుణ్ణంగా పరిశీలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఏ మాత్రం సందేహాస్పదంగా వున్న అక్కడ్నించి నేరుగా అనంతగిరి రిసార్ట్సులో నెలకొల్పిన క్వారెంటైన్ సెంటర్‌కు తరలించేందుకు రెడీ అవుతున్నాయి తెలంగాణ వైద్య వర్గాలు.

గత వారం రోజులుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వస్తున్న ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గటంతో ఎయిర్‌పోర్టు ప్రాంగణమంతా నిర్మానుష్యంగా కనిపిస్తోంది. ఎయిర్‌పోర్టు లాంజ్‌లు వెలవెలబోతున్నాయి. ఎయిర్ పోర్టులో గుర్తించే కరోనా అనుమానితులు.. లక్షణాలు కలిగిన వ్యక్తుల తరలింపునకు ఏర్పాట్లను రెట్టింపు చేశారు. 15 అంబులెన్సులను అందుబాటులో వుంచారు. అదనపు సిబ్బందిని నియమించారు.

శంషాబాద్ విమానాశ్రయం ఏరియాలో 144 సెక్షన్ వాతావరణం ప్రతిబింబిస్తోంది. ఎయిర్ పోర్టుకు వస్తున్న ప్రతి విమాన ప్రయాణికుడ్ని వైద్య బృందాలు స్క్రీనింగ్ చేస్తున్నాయి. విదేశాలనుండి వచ్చే వారిని అవసరం మేరకు క్యారెంటైన్ సెంటర్లకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు.