ముంబైను ముంచెత్తుతున్న వర్షాలు

|

Jul 05, 2020 | 2:31 PM

అసలే కరోనాతో విలవిలలాడుతున్న ముంబై మహానగరానికి భారీ వర్షాలు తోడయ్యాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో నగరవాసులు అల్లాడిపోతున్నారు. థానేతో సహా మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతాల్లో వరుసగా మూడు రోజులుగా కుండపోతగా వానలు పడుతున్నాయి. దాదాపు 28 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది.

ముంబైను ముంచెత్తుతున్న వర్షాలు
Follow us on

అసలే కరోనాతో విలవిలలాడుతున్న ముంబై మహానగరానికి భారీ వర్షాలు తోడయ్యాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో నగరవాసులు అల్లాడిపోతున్నారు. థానేతో సహా మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతాల్లో వరుసగా మూడు రోజులుగా కుండపోతగా వానలు పడుతున్నాయి. దాదాపు 28 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీటితో మునిగిపోయాయి. రాబోయే 24 గంటల్లో ముంబయి సహా చుట్టు పక్కల ప్రాంతాల్లో భారీగా వర్షపాతం చోటుచేసుకునే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.

గత రెండు రోజులుగా పడుతున్న వర్షాలతో సెంట్రల్ ముంబయిలోని హింద్‌మతా, తూర్పు శివారులోని చెంబూర్‌ ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. గడచిన 24 గంటల్లో దక్షిణ ముంబయిలోని కొలాబా అబ్జర్వేటరీలో 129.6 మి.మీ వర్షపాతం నమోదుకాగా, శాంతాక్రూజ్‌ ప్రాంతంలో 200.8 మి.మీ. వర్షపాతం నమోదయినట్లు ఐఎండీ వర్గాలు వెల్లడించాయి. థానే జిల్లా పరిసర ప్రాంతాలతో సహా కొంకణ్ ప్రాంతంలోని సింధ్‌దుర్గ్‌లో భారీ వర్షపాతం నమోదయినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో రోడ్లపై చేరుకున్న నీటితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెట్లు నేల కొరిగి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నీటి మునిగిన లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి సహాయకచర్యలు ముమ్మరం చేశారు బృహన్‌ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్‌ వర్గాలు.