ఆంధ్ర, తెలంగాణలో కుంభవృష్టి

|

Sep 26, 2020 | 8:21 AM

తెలుగు రాష్ట్రాల్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇరు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో కురిసిన కుంభవృష్టి వానకి రోడ్లు జలమయమయ్యాయి. కరెంట్ సరఫరా నిలిచపోయింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖ, వరంగల్ సహా ప్రముఖ నగరాల్లో జనజీవనం స్థంభించిపోయింది. ప్రకాశంజిల్లా గిద్దలూరులో లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. గిద్దలూరు పరిసర ప్రాంతాల్లో రాత్రి కురిసిన భారీ వర్షానికి పట్టణంలోని పలు కాలనీల్లోని ఇళ్ళల్లోకి నడుములోతు నీరు వచ్చి చేరింది. దీంతో ఇళ్ళల్లో ఉండలేక […]

ఆంధ్ర, తెలంగాణలో కుంభవృష్టి
Follow us on

తెలుగు రాష్ట్రాల్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇరు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో కురిసిన కుంభవృష్టి వానకి రోడ్లు జలమయమయ్యాయి. కరెంట్ సరఫరా నిలిచపోయింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖ, వరంగల్ సహా ప్రముఖ నగరాల్లో జనజీవనం స్థంభించిపోయింది. ప్రకాశంజిల్లా గిద్దలూరులో లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. గిద్దలూరు పరిసర ప్రాంతాల్లో రాత్రి కురిసిన భారీ వర్షానికి పట్టణంలోని పలు కాలనీల్లోని ఇళ్ళల్లోకి నడుములోతు నీరు వచ్చి చేరింది. దీంతో ఇళ్ళల్లో ఉండలేక జనం సురక్షిత ప్రాంతాలకు తరలివెళుతున్నారు.

లోతట్టు ప్రాంతాలు శ్రీనివాస ధియేటర్ ప్రాంతం, సత్య నారాయణ నగర్, ఖాదర్ వలీ దర్గా ప్రాంతాల్లోని వీధులు, ఇళ్ళు నీట మునిగాయి. వీధులన్నీ వాగులను తలపిస్తుండటంతో ఒకరినొకరు ఆసరాగా పట్టుకుని స్థానికులు సురక్షిత ప్రాంతాలకు వెళుతున్నారు. ఇళ్ళల్లోని వస్తువులు, సామాగ్రి అలాగే వదిలేసి వెళ్ళాల్సిన దుస్థితి నెలకొంది. అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రకటించారు. అటు, గిద్దలూరు నుంచి కడప జిల్లా కు వెళ్లే మార్గంలో వంతెన పై నుంచి నీటి ఉదృతి పెరగటంతో రాకపోకలు నిలిచిపోయాయి. కుండపోత వర్షంతో ఏపీ, తెలంగాణలో పల్లె వాసులు నానా ఇక్కట్లు పడుతున్నారు.