ఏపీ: అవినీతిలో.. టాప్‌ జిల్లా ఇదే..! పోటెత్తిన ఫోన్ కాల్స్..

| Edited By: Srinu

Dec 02, 2019 | 5:09 PM

ఏపీలో.. సీఎం జగన్మోహన్ రెడ్డి పెట్టిన 14400 కాల్ సెంటర్‌కు ప్రజల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. ప్రజలు.. వారు ఫేస్‌ చేస్తోన్న ప్రతీ సమస్యను ఆ కాల్ సెంటర్‌కు ఫిర్యాదు చేసి చెబుతున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా.. లంచం పెట్టనిదే పని జరగట్లేదు. దీంతో.. చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటోన్న విషయం తెలిసిందే కదా.. అందుకనే సీఎం జగన్ ఈ కాల్ సెంటర్‌ను తీసుకొచ్చారు. సమస్య చెప్పిన 15 రోజుల్లో దాన్ని పూర్తి చేయాలని.. అధికారులకు […]

ఏపీ: అవినీతిలో.. టాప్‌ జిల్లా ఇదే..! పోటెత్తిన ఫోన్ కాల్స్..
Follow us on

ఏపీలో.. సీఎం జగన్మోహన్ రెడ్డి పెట్టిన 14400 కాల్ సెంటర్‌కు ప్రజల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. ప్రజలు.. వారు ఫేస్‌ చేస్తోన్న ప్రతీ సమస్యను ఆ కాల్ సెంటర్‌కు ఫిర్యాదు చేసి చెబుతున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా.. లంచం పెట్టనిదే పని జరగట్లేదు. దీంతో.. చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటోన్న విషయం తెలిసిందే కదా.. అందుకనే సీఎం జగన్ ఈ కాల్ సెంటర్‌ను తీసుకొచ్చారు. సమస్య చెప్పిన 15 రోజుల్లో దాన్ని పూర్తి చేయాలని.. అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు సీఎం సార్.

అయితే.. ప్రస్తుతం ఈ కాల్ సెంటర్‌కు గుంటూరు జిల్లా నుంచి విపరీతమైన కాల్స్ వస్తున్నాయట. అది కూడా.. అవినీతిపై.. అందులోనూ.. రెవెన్యూ, విద్యుత్, పురపాలక అధికారులపై ఎక్కువగా ఆరోపణలు వెల్లువెత్తున్నాయట. బర్త్ సర్టిఫికేట్, కాస్ట్ సర్టిఫికేట్, భూ రిజిస్ట్రేట్స్, వాటర్ బిల్, కరెంట్ బిల్లు, ఇంటి పన్ను.. ఇలా అన్నీ కావాలంటే.. లంచం పెట్టనిదే పని జరగట్లేదని వారు వాపోతున్నారట. ముఖ్యంగా.. రెవెన్యూ శాఖపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయని కాల్ సెంటర్ నిర్వాహకులు చెబుతున్నారు. అవినీతికి సంబంధించి.. మొత్తంగా 200లకు పైగానే.. కాల్స్ వచ్చాయట. అయితే.. ఈ వచ్చిన ఫిర్యాదులకు అనుగుణంగా.. తగిన ఉద్యోగులపై చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమవుతున్నారట ఏసీబీ అధికారులు.

వివిధ పనులకు సంబంధించిన.. ఫ్రూవులు ఏమైనా ఉన్నాయా..? వారి ఏ పని మీద ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లారు? ఏ అధికారి లంచం డిమాండ్ చేశారు..? తదితర విషయాలను ప్రజల నుంచి సేకరిస్తున్నారని సమాచారం. ఇవన్నీ రుజువైతే గనుక.. తప్పకుండా… తగిన అధికారులపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం రెడీగా ఉందని సమాచారం. చూడాలి మరి.. ఈ కాల్ సెంటర్ నిర్ణయాలు ఏమేరకు ఉపయోగపడతాయో..!