గుంటూరులో లాక్ డౌన్ ఉల్లంఘిస్తే వెరైటీ పనిష్మెంట్..ఇలా చేస్తే ఎవ్వ‌రూ బ‌య‌ట‌కి రారు…

|

Apr 23, 2020 | 4:18 PM

‘నేను మూర్ఖుడిని.. నేను సమాజానికి శత్రువుని.. నేను మాస్క్‌ పెట్టుకోను… పనీపాటా లేకుండా ఉత్తినే రోడ్డు మీద తిరిగి కరోనా వైరస్‌ను వ్యాప్తి చేస్తాను. ప్రజల ప్రాణాలతో ఆడుకుంటాను’… ఇవి కేవలం చెప్పడమే కాదు.. ఇదంతా సెల్ఫీ తీసి వాట్సప్‌లో డీపీ పెట్టాలి. రోడ్లపై అడ్డదిడ్డంగా తిరుగుతూ మాస్క్‌లు పెట్టుకోని వారికి ఓ ఎస్‌ఐ ఇస్తున్న పనిష్మెంట్‌ ఇది. గుంటూరు రూరల్‌ కొల్లూరులో ఇదే చేస్తున్నారు ఎస్‌ఐ ఉజ్వల్‌ కుమార్‌. నేను మూర్ఖుడిని అంటూ ఓ బోర్డు […]

గుంటూరులో లాక్ డౌన్ ఉల్లంఘిస్తే వెరైటీ పనిష్మెంట్..ఇలా చేస్తే ఎవ్వ‌రూ బ‌య‌ట‌కి రారు...
Follow us on

‘నేను మూర్ఖుడిని.. నేను సమాజానికి శత్రువుని.. నేను మాస్క్‌ పెట్టుకోను… పనీపాటా లేకుండా ఉత్తినే రోడ్డు మీద తిరిగి కరోనా వైరస్‌ను వ్యాప్తి చేస్తాను. ప్రజల ప్రాణాలతో ఆడుకుంటాను’… ఇవి కేవలం చెప్పడమే కాదు.. ఇదంతా సెల్ఫీ తీసి వాట్సప్‌లో డీపీ పెట్టాలి. రోడ్లపై అడ్డదిడ్డంగా తిరుగుతూ మాస్క్‌లు పెట్టుకోని వారికి ఓ ఎస్‌ఐ ఇస్తున్న పనిష్మెంట్‌ ఇది. గుంటూరు రూరల్‌ కొల్లూరులో ఇదే చేస్తున్నారు ఎస్‌ఐ ఉజ్వల్‌ కుమార్‌. నేను మూర్ఖుడిని అంటూ ఓ బోర్డు రాయించి అక్కడే సెల్ఫీ పాయింట్‌ పెట్టించారు. కారణం లేకుండా రోడ్ల మీదకు వచ్చేవారిని… మాస్క్‌ పెట్టుకోని వారిని ఆ బోర్డు దగ్గర సెల్ఫీ తీసుకోమంటున్నారు.. లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించినవారంతా అక్కడ సెల్ఫీ దిగాలి. ఆ ఫోటోను వాట్సప్‌లో డీపీగా పెట్టుకోవాలి. పైగా ఫ్రెండ్స్‌కు.. తెలిసినవారికంతా షేర్‌ చేయాలి.