బ్రేకింగ్: మునిసిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్

|

Jan 07, 2020 | 7:14 PM

తెలంగాణ మునిసిపల్ ఎన్నికల ప్రక్రియను వాయిదా వేయించాలన్న కాంగ్రెస్ పార్టీ ఎత్తులు పారలేదు. నోటిఫికేషన్ వాయిదా వేయాలంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు దాఖలు చేసిన పిటీషన్‌ను హైదరాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది. ఎన్నికలను అపాలంటూ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి దాఖలు చేయించిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. దాంతో మునిసిపల్ ఎన్నికల నిర్వహణ కోసం ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్ జారీకి గ్రీన్ సిగ్నల్ లభించింది. డిసెంబర్ నాలుగో వారంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి […]

బ్రేకింగ్: మునిసిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్
Follow us on

తెలంగాణ మునిసిపల్ ఎన్నికల ప్రక్రియను వాయిదా వేయించాలన్న కాంగ్రెస్ పార్టీ ఎత్తులు పారలేదు. నోటిఫికేషన్ వాయిదా వేయాలంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు దాఖలు చేసిన పిటీషన్‌ను హైదరాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది. ఎన్నికలను అపాలంటూ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి దాఖలు చేయించిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. దాంతో మునిసిపల్ ఎన్నికల నిర్వహణ కోసం ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్ జారీకి గ్రీన్ సిగ్నల్ లభించింది.

డిసెంబర్ నాలుగో వారంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి నాగిరెడ్డి రాష్ట్రంలోని 120 మునిసిపాలిటీలు, 10 మునిసిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించారు. జనవరి నాలుగో తేదీలోగా రిజర్వేషన్లను ప్రకటించి, జనవరి ఏడో తేదీన నోటిఫికేషన్ జారీ చేయాలని ఎన్నికల అధికారులు భావించారు. అయితే రిజర్వేషన్లు ప్రకటించిన నాలుగు వారాల తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నేతలు హైదరాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని విచారించిన హైకోర్టు.. నోటిఫికేషన్ను ఏడోతేదీ సాయంత్రం దాకా విడుదల చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

తాజాగా కాంగ్రెస్ నేతల పిటిషన్‌ను కొట్టేసిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల అధికారి గతంలో ప్రకటించిన విధంగానే నోటిఫికేషన్ జారీ చేసి, ఎన్నికలు నిర్వహించబోతున్నారు. జనవరి 8న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై.. జనవరి 22న పోలింగ్ జరుగుతుంది. జనవరి 25న కౌంటింగ్ నిర్వహించి, అదే రోజున ఫలితాలు ప్రకటిస్తారు. అయితే.. మహబూబ్‌నగర్, వనపర్తి మునిసిపాలిటీల ఎన్నికలపై హైకోర్టు స్టే ఇచ్చింది. దాంతో పాటు కరీంనగర్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని మూడు డివిజన్ల ఎన్నికలపై కూడా స్టే విధించింది. అంటే రాష్ట్రంలోని 118 మునిసిపాలిటీలకు ఎన్నికలు యధావిధిగా జరగనున్నాయి.