ప్యారడైజ్ బిర్యానీ గురించి షాకింగ్ న్యూస్ !

| Edited By: Anil kumar poka

Oct 17, 2019 | 6:59 PM

సికింద్రాబాద్‌కు వెళుతున్నారా ? ప్యారడైజ్ బిర్యానీ అంటే నోరూరుతోందా ? జర జాగ్రత్త.. అక్కడ బిర్యానీ తినే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఈ మాట అంటున్ననది మేము కాదు.. సాక్షాత్తు జీహెచ్ఎంసీ అధికారులు. అసలేం జరిగిందంటే…? సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్‌కు రూ.లక్ష జరిమానా పడింది. ఆహార పదార్థాల్లో నాణ్యత లేనట్లు గుర్తించిన జీహెచ్‌ఎంసీ అధికారులు జరిమానా విధించారు. వారం రోజుల్లో సరిచేసుకోకపోతే హోటల్ మూసేస్తామని అధికారులు హెచ్చరించారు. బిర్యానిలో వెంట్రుకలు వచ్చాయని వినియోగదారుడు ఫిర్యాదు చేశాడు. హోటల్ […]

ప్యారడైజ్ బిర్యానీ గురించి షాకింగ్ న్యూస్ !
Follow us on

సికింద్రాబాద్‌కు వెళుతున్నారా ? ప్యారడైజ్ బిర్యానీ అంటే నోరూరుతోందా ? జర జాగ్రత్త.. అక్కడ బిర్యానీ తినే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఈ మాట అంటున్ననది మేము కాదు.. సాక్షాత్తు జీహెచ్ఎంసీ అధికారులు. అసలేం జరిగిందంటే…?

సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్‌కు రూ.లక్ష జరిమానా పడింది. ఆహార పదార్థాల్లో నాణ్యత లేనట్లు గుర్తించిన జీహెచ్‌ఎంసీ అధికారులు జరిమానా విధించారు. వారం రోజుల్లో సరిచేసుకోకపోతే హోటల్ మూసేస్తామని అధికారులు హెచ్చరించారు. బిర్యానిలో వెంట్రుకలు వచ్చాయని వినియోగదారుడు ఫిర్యాదు చేశాడు. హోటల్ వారు పట్టించుకోకపోవడంతో వినియోగదారుడు జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు ఇచ్చాడు. దాంతో  రంగంలోకి దిగిన జిహెచ్ఎంసీ అధికారులు హోటల్‌లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. హోటల్ క్యాంటీన్‌ను, ప్యాంట్రీని, వినియోగిస్తున్న వస్తువులను, నిల్వ వుంచిన పదార్థాలను పరిశీలించారు. వినియోగిస్తున్న స్టీల్ సామాగ్రి నాసిరకంగా వుండడంతోపాటు.. నిల్వ వుంచిన ఆహార పదార్థాలు నాణ్యతతో లేకపోవడంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిల్వ వుంచి మాంస పదార్థాల్లో తాజావి కావని కొందరు ఫిర్యాదు చేయడంతో ఫ్రీజర్లను తనిఖీ చేశారు అధికారులు. వంట సామాగ్రి చిలుము పట్టి వుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల రోజుల్లో మరోసారి తనిఖీలకు వస్తామని హెచ్చరించారు. ప్రస్తుతానికి లక్ష రూపాయల జరిమానా విధిస్తున్నామని, పరిస్థితిలో మార్పు లేకపోతే హోటల్‌ని, అన్ని బ్రాంచీలను సీజ్ చేయాల్సి వుంటుందని వార్నింగ్ ఇచ్చి మరీ అక్కడ్నించి కదిలారు జిహెచ్ఎంసీ అధికారులు.