హర్యానా : ఇండియన్ నేషనల్ లోక్ దళ్ మాజీ నాయకుడు సతీష్ దేశ్వాల్‌ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ ఘటన సోమవారం రోజున గురుగావ్‌లోని ఆయన హోటల్లోనే జరిగింది. తన మహారాజా హోటల్లో ఆయన కౌంటరులో కూర్చొని ఉండగా కొందరు తుపాకులతో వచ్చి విచక్షణారహితంగా కాల్పులకు దిగారు. డజనుకు పైగా బుల్లెట్లు ఆయన శరీరంలోకి దిగడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించారు. సతీష్ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. హోటల్‌లో ఉన్న సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నామని పోలీస్ అధికారులు తెలిపారు.