సినిమాలు చాలు.. రాజకీయాల్లోకి రండి

కోలీవుడ్‌లో ఉన్న టాలెంటెడ్‌ హీరోల్లో సూర్య ఒకరు. మొదటి నుంచి వైవిధ్య కథలను ఎంచుకుంటూ ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకొని

సినిమాలు చాలు.. రాజకీయాల్లోకి రండి

Edited By:

Updated on: Sep 06, 2020 | 11:32 AM

Suriya Fans Request: కోలీవుడ్‌లో ఉన్న టాలెంటెడ్‌ హీరోల్లో సూర్య ఒకరు. మొదటి నుంచి వైవిధ్య కథలను ఎంచుకుంటూ ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకొని టాప్ హీరోగా పేరు సాధించారు. అంతేకాదు అటు కోలీవుడ్‌ ఒక్కటే కాదు.. ఇటు టాలీవుడ్‌లోనే ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నారు. ఈ క్రమంలో సినిమా ఇండస్ట్రీలో 23 సంవత్సరాలను పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా అభిమానుల నుంచి ఓ వినూత్న ఆహ్వానాన్ని అందుకున్నారు సూర్య.

మీరు సినిమాలు ఏలింది చాలు. ఇక తమిళనాడును పాలించడానికి రండి అన్న నినాదంతో సూర్య అభిమానులు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో పోస్టర్లు పెట్టారు. అందులో చేగువేరా రూపంలో సూర్య ఫొటోలను ఉంచారు. ఇక ఈ పోస్టర్లు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అయితే తమిళనాడులో సినిమాలకు, రాజకీయాలకు మధ్య ఉన్న అనుబంధం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో రాణించిన ఎంతోమంది ఆ రాష్ట్రాన్ని కూడా ఏలారు. ఈ క్రమంలో రజనీకాంత్‌, కమల్ హాసన్‌లు కూడా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలను స్థాపిచచారు. ఇక నిన్నటికి నిన్న రాఘవ లారెన్స్ కూడా రజనీకాంత్‌ పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. ఇలాంటి సమయంలో ఎన్నో సహాయ కార్యక్రమాలను చేస్తోన్న సూర్యను కూడా రాజకీయాల్లోకి రావాలంటూ ఫ్యాన్స్ కోరడం విశేషం.

Read More:

నూతన్ నాయుడుపై మరో కేసు…

“కెరీర్ ప్లాన్ చేయ‌ను, నిజాయితీగా ప‌ని చేస్తా”