Breaking news: ఏపీ స‌ర్కార్‌కు హైకోర్టు షాక్..ఆ రెండు జీవోలు కొట్టివేత‌

|

Apr 15, 2020 | 12:51 PM

ఏపీ స‌ర్కార్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ఇంగ్లీష్‌ మీడియం త‌ప్ప‌నిస‌రి చేస్తూ స‌ర్కార్ జారీ చేసిన జీవో 81, 85ను హైకోర్టు కొట్టివేసింది.

Breaking news: ఏపీ స‌ర్కార్‌కు హైకోర్టు షాక్..ఆ రెండు జీవోలు కొట్టివేత‌
Follow us on
ఏపీ స‌ర్కార్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ఇంగ్లీష్‌ మీడియం త‌ప్ప‌నిస‌రి చేస్తూ  స‌ర్కార్ జారీ చేసిన జీవో 81, 85ను హైకోర్టు  కొట్టివేసింది. ఏ మాధ్యమంలో చదువుకోవాలి అన్న విషయం పిల్లలు, వారి తల్లిదండ్రులు నిర్ణయించుకుంటారంటూ జీవోను సవాల్ చేస్తూ న్యాయవాది ఇంద్రనీల్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన హైకోర్టు జీవోను కొట్టివేసింది. ఆంగ్లమాధ్యమాన్ని తప్పని సరి చేస్తే కొందరి బ్యాక్ లాగ్ లు మిగిలిపోయే అవకాశం ఉందని న్యాయవాది తన పిటిషన్ లో పేర్కొన్నారు. వాదనలు విన్న హైకోర్టు ఇప్పటికే తీర్పు రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ రోజు ప్రభుత్వ జీవోను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓ 81, 85ను జీవోను సవాల్ చేస్తూ ఏలూరుకు చెందిన డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.