అమరావతిలో 40 వేల కోట్ల కుంభకోణం : ఏలూరు ఎంపీ

|

Sep 20, 2020 | 4:50 PM

అమరావతిలో రాజధాని ప్రకటనకి ముందే నాలుగు వేల ఎకరాలకు అగ్రిమెంట్ చేసుకున్నారని వైసీపీ ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ చెప్పారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు అతని పార్టీ పెద్దలు మొత్తంగా 40,000 కోట్ల రూపాయల భారీ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. దీనిపై సీబీఐ దర్యాప్తు వెంటనే ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. టీడీపీ నేతలు, సుప్రీంకోర్టు జడ్జిలు సైతం భూములు పొందారంటూ ఆయన తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. జగన్ ప్రభుత్వం చేసే ప్రతి మంచి పనికి […]

అమరావతిలో 40 వేల కోట్ల కుంభకోణం : ఏలూరు ఎంపీ
Follow us on

అమరావతిలో రాజధాని ప్రకటనకి ముందే నాలుగు వేల ఎకరాలకు అగ్రిమెంట్ చేసుకున్నారని వైసీపీ ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ చెప్పారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు అతని పార్టీ పెద్దలు మొత్తంగా 40,000 కోట్ల రూపాయల భారీ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. దీనిపై సీబీఐ దర్యాప్తు వెంటనే ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. టీడీపీ నేతలు, సుప్రీంకోర్టు జడ్జిలు సైతం భూములు పొందారంటూ ఆయన తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. జగన్ ప్రభుత్వం చేసే ప్రతి మంచి పనికి కోర్టులు అడ్డుపడుతున్నాయని శ్రీధర్ అన్నారు. కోర్టులు ప్రతిపక్షంలాగా వ్యవహరిస్తున్నాయని కామెంట్లు చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులతో రాష్ట్రమంతా తమ పార్టీకి మంచి మర్యాద ఉందని.. వచ్చే ఎన్నికల్లో 151 మించి సీట్లు గెలుచుకుంటామని ఆయన అన్నారు. ప్రతి మతం, కులం కోసం తమ పార్టీ పోరాడుతుందని ఎంపీ స్పష్టం చేశారు.