రీ పోలింగ్‌పై రేపు నిర్ణయం- ద్వివేది

|

Apr 11, 2019 | 8:38 PM

ఎన్నికల్లో 25 హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నట్లు ఏపీ రాష్ట్ర ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. వివిధ ఘటనల్లో ఇద్దరు చనిపోయారని అన్నారు. గురువారం పోలింగ్ టైం ముగిసిన అనంతరం ద్వివేది అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ఎక్కడైనా రీపోలింగ్ అవసరమా అనే విషయంపై శుక్రవారం నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రీపోలింగ్‌పై రాజకీయ పార్టీల నుంచి ఫిర్యాదులు వచ్చాయన్నారు. 7 చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేశారని వారిపై కేసులు నమోదైనట్లు తెలిపారు. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్‌ […]

రీ పోలింగ్‌పై రేపు నిర్ణయం- ద్వివేది
Follow us on

ఎన్నికల్లో 25 హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నట్లు ఏపీ రాష్ట్ర ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. వివిధ ఘటనల్లో ఇద్దరు చనిపోయారని అన్నారు. గురువారం పోలింగ్ టైం ముగిసిన అనంతరం ద్వివేది అమరావతిలో మీడియాతో మాట్లాడారు. ఎక్కడైనా రీపోలింగ్ అవసరమా అనే విషయంపై శుక్రవారం నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రీపోలింగ్‌పై రాజకీయ పార్టీల నుంచి ఫిర్యాదులు వచ్చాయన్నారు. 7 చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేశారని వారిపై కేసులు నమోదైనట్లు తెలిపారు. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసిందన్నారు. సాయంత్రం 6 గంటలకు 75 శాతం పోలింగ్‌ నమోదయ్యిందని వెల్లడించారు. మొత్తం మీద పోలింగ్‌ శాతం 80 శాతం దాటవచ్చని అభిప్రాయపడ్డారు. కొన్ని చోట్ల ఎన్నికల సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పొరపాట్లు జరిగినట్టు తెలిపారు. పోలింగ్ 80 శాతం మేర జరగొచ్చని అంచనా. పోలింగ్‌కు మరింత సమయం కేటాయించాలన్న.. పార్టీల ఫిర్యాదులను జిల్లా కలెక్టర్లకు పంపించామని చెప్పారు.