విశాఖపట్నం : ప్రజల ప్రాణాలను కాపాడటానికి ఉపయోగించే అంబులెన్స్ లో గంజాయి తరలిస్తూ ముఠాను డీఆర్ఐ అధికారులు విశాఖలో పట్టుకున్నారు. పక్కా సమాచారంతో డైరక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు అంబులెన్స్ లను తనిఖీలు చేపట్టారు. విశాఖ పట్నం సమీపంలో చెన్నై-కలకత్తా హైవేపై భారీఎత్తున గంజాయి తరలిస్తున్నఓ అంబులెన్స్ ను డీఆర్ఐ అధికారులు గుర్తించారు. దీంతో అంబులెన్స్ ను వెంబడించి సబ్బవరం వద్ద ఆపారు. అందులో తనిఖీ చేపట్టిన అధికారులు 1813 కేజీల గంజాయిని గుర్తించారు. దీన్ని స్వాధీనం చేసుకుని అధికారులు నిందితుడిని స్థానిక పోలీసులకు అప్పగించారు. పట్టుబడిన గంజాయి విలువ మార్కెట్లో రూ.2,71,95,000 ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. స్మగ్లర్ ను అదుపులోకి తీసుకున్న డీఆర్ఐ అధికారులు స్థానిక పోలీసులకు అప్పగించారు.