డ్రోన్‌ల కూల్చివేతపై ముదురుతున్న మాటల యుద్ధం

| Edited By: Pardhasaradhi Peri

Jul 21, 2019 | 9:34 AM

డ్రోన్ల కూల్చివేతపై అటు అమెరికా.. ఇటు ఇరాన్ ఈరెండు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. గత కొంతకాలంగా ఈ రెండు దేశాలు ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందు ప్రయత్నాలుచేస్తూనే ఉన్నాయి. ఎవరూ తగ్గని పరిస్థితి. డ్రోన్లు కూల్చివేతలపై టెహ్రాన్, వాషింగ్టన్ మధ్య యుద్ద మేఘాలు కమ్ముుకున్నాయి. కొన్నిరోజుల క్రితం అమెరికాకు చెందిన డ్రోన్‌ను ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కూల్చివేశారు. అది మా భూభాగంలోకి చొచ్చుకుని రావడంతోనే కూల్చివేశామని ఇరాన్ ప్రకటించింది. అయితే తమ డ్రోన్ సరిహద్దులు […]

డ్రోన్‌ల కూల్చివేతపై ముదురుతున్న  మాటల యుద్ధం
Follow us on

డ్రోన్ల కూల్చివేతపై అటు అమెరికా.. ఇటు ఇరాన్ ఈరెండు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. గత కొంతకాలంగా ఈ రెండు దేశాలు ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందు ప్రయత్నాలుచేస్తూనే ఉన్నాయి. ఎవరూ తగ్గని పరిస్థితి. డ్రోన్లు కూల్చివేతలపై టెహ్రాన్, వాషింగ్టన్ మధ్య యుద్ద మేఘాలు కమ్ముుకున్నాయి. కొన్నిరోజుల క్రితం అమెరికాకు చెందిన డ్రోన్‌ను ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కూల్చివేశారు. అది మా భూభాగంలోకి చొచ్చుకుని రావడంతోనే కూల్చివేశామని ఇరాన్ ప్రకటించింది. అయితే తమ డ్రోన్ సరిహద్దులు దాటలేదని వాదిస్తోంది అమెరికా. దీంతో ఈ రెండు దేశాల మధ్య యుద్ధ మేఘాలు ఆవించాయి.

అయితే తాజాగా ఇరాన్‌కు చెందిన డ్రోన్‌ను కూల్చివేసినట్టుగా ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. యూఎస్ఎస్ బాక్సర్ నౌక వెయ్యి గజాల దూరంలో ఇరాన్ డ్రోన్‌ను గమనించిందని అయితే అక్కడినుంచి తప్పుకోవాలని పలుమార్లు హెచ్చిరించినా తీరు మారకపోవడంతో నౌక సిబ్బంది కూల్చివేసినట్టుగా ట్రంప్ ప్రకటించారు. ఇదిలా ఉంటే తమ డ్రోన్లన్నీ సురక్షితంగానే ఉన్నాయని కూల్చివేతకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవంటోంది ఇరాన్.