రిజర్వ్ బ్యాంకు విడుదల చేసిన 50 మంది డీఫాల్టర్ల జాబితాలో బాబా రాందేవ్ అండ్ బాలకృష్ణ గ్రూప్ నిర్వహిస్తున్న రుచి సోయా ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఇండోర్) కూడా ఉంది. ఈ సంస్థ రూ.2,212 కోట్లను చెల్లించాల్సి ఉందట. ఇంకా మె హుల్ చోక్సీ ఆధ్వర్యంలోని గీతాంజలి జెమ్స్ లిమిటెడ్ రూ. 5,492 కోట్లను, ఇతని నేతృత్వంలోని ఇతర సంస్థలయిన గిలీ ఇండియా రూ. 1447, నక్షత్ర బ్రాండ్స్ లిమిటెడ్ రూ. 1109 కోట్లను చెల్లించాల్సి ఉంది. పరారీలో ఉన్న జతిన్ మెహతాకు చెందిన విన్ సమ్ డైమండ్స్ అండ్ జువెల్లరీ రూ..4,076 కోట్లను, విజయ్ మాల్యా ఆధ్వర్యంలో ఒకప్పుడు నడిచిన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ సంస్థ రూ. 1943 కోట్లను చెల్లించవలసి ఉంది. వీరిలో చాలామందిపై ఈడీ కేసులు నమోదు చేసింది.