వలస కార్మికులకు క్వారెంటైన్‌గా.. ‘దెయ్యాల గ్రామాలు’

వలస కార్మికులకు క్వారెంటైన్‌గా.. 'దెయ్యాల గ్రామాల'ను మార్చనుంది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. సాధారణంగా వలస కూలీలకు క్వారంటైన్‌ చేసేందుకు స్కూళ్లు, గ్రామ పంచాయతీ భవనాలు, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భవనాలను వాడుతారు. కానీ ఉత్తరాఖండ్ ప్రభుత్వం మాత్రం..

వలస కార్మికులకు క్వారెంటైన్‌గా.. దెయ్యాల గ్రామాలు

Edited By:

Updated on: May 15, 2020 | 4:43 PM

వలస కార్మికులకు క్వారెంటైన్‌గా.. ‘దెయ్యాల గ్రామాల’ను మార్చనుంది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. సాధారణంగా వలస కూలీలకు క్వారంటైన్‌ చేసేందుకు స్కూళ్లు, గ్రామ పంచాయతీ భవనాలు, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భవనాలను వాడుతారు. కానీ ఉత్తరాఖండ్ ప్రభుత్వం మాత్రం వినూత్నంగా ఆలోచించింది. లాక్‌డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకొని స్వస్థలాలకు వస్తున్న వలస కార్మికులను క్వారంటైన్ చేసేందుకు ఉత్తరాఖండ్ ‘దెయ్యాల గ్రామాలను’ వాడుతోంది.

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరాఖండ్‌లోని పౌరి జిల్లాలోని చాలా గ్రామాల్లో ఇళ్లన్నీ ఖాళీగా ఉంటాయి. అక్కడ కనీస సదుపాయాలు కూడా లేకపోవడంతో.. చాలా కుటుంబాలు అక్కడి నుంచి మెరుగైన ప్రాంతాలకు వెళ్లిపోయాయి. దీంతో అక్కడి గృహాలకు తాళాలు వేసి దర్శనమిస్తాయి. దీంతో వీటిని ‘దెయ్యాల గ్రామాలుగా’ పిలుస్తూంటారు. ప్రస్తుతం వలస కార్మికులకు క్వారంటైన్ చేసేందుకు ఈ ఇళ్లను వినియోగించాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

పౌరి జిల్లాలో అత్యధికంగా 186 నిర్జన గ్రామాలు ఉన్నాయి. ఖాళీగా ఉన్న ఇళ్లను ప్రస్తుతం అక్కడి అధికారులు శుభ్రం చేయించారు. అన్ని సదుపాయాలూ కల్పించి 576 మందిని క్వారంటైన్ చేశారు. కొన్ని దశాబ్దాల నుంచి ఈ గ్రామాలు ఖాళీగానే ఉన్నాయి. రోజురోజుకీ బయటి నుంచే వచ్చే వలస కూలీల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. దీంతో అక్కడి దెయ్యాల గ్రామాలను వాడుకోవడం మంచిదని ఉత్తరాఖండ్ ప్రభుత్వం భావిస్తోంది.

Read More:

మరో ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం.. దట్టంగా అలుముకున్న పొగలు

రైతులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్.. నేరుగా అకౌంట్లలో నగదు జమ

ఏపీలో జులై 10 నుంచి టెన్త్ పరీక్షలు.. ఏరోజు ఏ పరీక్షంటే!