అంత్యక్రియలను అడ్డుకున్న గ్రామస్తులు

కరోనా మనషుల మధ్య దూరాన్ని మరింత పెంచుతోంది. మానవత్వం మరిచిన జనంలో మంచితనం కరువవుతోంది. కాలం చేసినవారిపట్ల విచక్ష కోల్పోయి ప్రవర్తిస్తున్నారు. అనారోగ్యంతో చనిపోయిన వ్యక్తిని ఖననం చేసేందుకు గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ అమానుష ఘటన చిత్తూరు జిల్లాలో వెలుగుచూసింది.

అంత్యక్రియలను అడ్డుకున్న గ్రామస్తులు

Updated on: Jul 12, 2020 | 6:11 PM

కరోనా మనషుల మధ్య దూరాన్ని మరింత పెంచుతోంది. మానవత్వం మరిచిన జనంలో మంచితనం కరువవుతోంది. కాలం చేసినవారిపట్ల విచక్ష కోల్పోయి ప్రవర్తిస్తున్నారు. అనారోగ్యంతో చనిపోయిన వ్యక్తిని ఖననం చేసేందుకు గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ అమానుష ఘటన చిత్తూరు జిల్లాలో వెలుగుచూసింది.

చిత్తూరు జిల్లా మదనపల్లి గ్రామీణ మండలం వలసపల్లెలో ఓ వ్యక్తి శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆరోగ్యం క్షీణించడంతో అతడిని మెరుగైన వైద్యం కోసం తిరుపతి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో తుదిశ్వాస విడిచాడు. దీంతో మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చిన కుటుంబసభ్యులు ఆదివారం అంత్యక్రియలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే, ఆ వ్యక్తిని గ్రామంలో ఖననం చేయడానికి వీలు లేదంటూ స్థానికులు అడ్డుకున్నారు. వీరికి పరిసర ప్రాంతాలకు చెందిన ఐదు గ్రామాల ప్రజలు వంతపాడుతూ, అంత్యక్రియలను నిలిపివేశారు. కరోనాతోనే చనిపోయాడని ఆరోపిస్తు ఖననానికి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఎట్టకేలకు మృతుడికి కరోనా పరీక్షలు నిర్వహించిన అనంతరం కర్మకాండలు చేసేందుకు కుటుంబసభ్యులు అంగీకరించారు. దీంతో వైద్య సిబ్బందికి సమాచారమిచ్చారు.