కోవిడ్ పేషెంట్ గాయబ్.. కర్నూలులో కొత్త టెన్షన్

|

May 28, 2020 | 4:07 PM

కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా పాజిటివ్ పేషెంట్ ఒకరు అదృశ్యమవడం స్థానికంగా కలకలం రేపుతోంది. కోవిడ్ చికిత్స తీసుకుంటున్న పేషెంట్ ఏకంగా పెద్దాసుపత్రి నుంచి మాయమయ్యారన్న వార్త

కోవిడ్ పేషెంట్ గాయబ్.. కర్నూలులో కొత్త టెన్షన్
Follow us on

Covid-19 positive patient missing from Kurnool government hospital: కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా పాజిటివ్ పేషెంట్ ఒకరు అదృశ్యమవడం స్థానికంగా కలకలం రేపుతోంది. కోవిడ్ చికిత్స తీసుకుంటున్న పేషెంట్ ఏకంగా పెద్దాసుపత్రి నుంచి మాయమయ్యారన్న వార్త కర్నూలు నగరంలో ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది.

కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన 64 ఏళ్ల మహిళకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. మే 23వ తేదీన ఆదోని నుంచి కర్నూలు కోవిడ్ ఆసుపత్రికి ఆమెను తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఐసొలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న సదరు మహిళ ఉన్నట్లుడి అదృశ్యమైంది. విషయం గురువారం ఉదయం వెలుగులోకి రావడంతో గాయబైన కరోనా పేషెంట్ కోసం గాలింపు చేపట్టారు.

కరోనా పేషెంట్ కోసం కర్నూలు బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు అధికారులు. అయితే, ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసొలేషన్ వార్డు నుంచి పేషెంట్ మాయమవడంపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాజిటివ్ పేషెంట్ పట్ల అంత నిర్లక్ష్యంగా ఎలా వుంటారని రాష్ట్ర రాజధాని నుంచి వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు జిల్లా ఆసుపత్రి అధికారయంత్రాంగాన్ని నిలదీసినట్లు తెలుస్తోంది.

ప్రభుత్వాసుపత్రి నుంచి కరోనా పాజిటివ్ పేషెంట్ పారిపోవడంపై కర్నూలు నగరంలో భయాందోళన మొదలైంది. పారిపోయిన కరోనా బాధితురాలు.. ఇంకా ఎంత మందికి కరోనా వైరస్ తగిలిస్తుందోనని, ఆమె జనావాస ప్రాంతాల్లోకి వచ్చి సంచరిస్తూ పరిస్థితి ఏంటని కర్నూలు నగర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాంతో మహిళ ఆనవాళ్ళపై అధికారులు ప్రజల్లో ప్రచారం మొదలు పెట్టారు. అయితే సదరు కరోనా పేషెంట్ కొడుమూరులో తారసపడినట్లు తెలుస్తోంది.