Corona Hot-spots హైదరాబాద్‌లో హాట్‌స్పాట్స్.. స్పెషల్ స్టెప్స్

| Edited By: Pardhasaradhi Peri

Apr 09, 2020 | 6:34 PM

కరోనా విజృంభిస్తున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్ఎంసీ సంయుక్తంగా పలు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగా హైదరాబాద్‌లో వైరస్ వేగంగా ప్రబలుతున్న ప్రాంతాలను గుర్తించి వాటిని హాట్ స్పాట్లు, కంటైన్ మెంట్ క్లస్టర్లుగా గుర్తించారు.

Corona Hot-spots హైదరాబాద్‌లో హాట్‌స్పాట్స్.. స్పెషల్ స్టెప్స్
Follow us on

Hot-spots in Hyderabad and special arrangements: కరోనా విజృంభిస్తున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్ఎంసీ సంయుక్తంగా పలు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగా హైదరాబాద్‌లో వైరస్ వేగంగా ప్రబలుతున్న ప్రాంతాలను గుర్తించి వాటిని హాట్ స్పాట్లు, కంటైన్ మెంట్ క్లస్టర్లుగా గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు.

హాట్ స్పాట్స్ ప్రాంతాలను పూర్తిగా జీహెచ్ఎంసీ ఆధీనంలోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దాంతో జీహెచ్ఎంసీ సర్కిళ్ళ వారీగా అధికారులకు నిర్దిష్టమైన మార్గదర్శకాలను ఇష్యూ చేశారు. కంటైన్‌మెంట్ క్లస్టర్లుగా ప్రకటించిన 15 ప్రాంతాలపై ఉత్తర్వులు జారీచేశారు జిహెచ్ ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్. క్లస్టర్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో వైద్య ఆరోగ్యశాఖ, జీహెచ్ఎంసీ అధికారులు ఇంటింటికి వెళ్లి తనిఖీలు నిర్వహిస్తారు.

రాంగోపాల్‌పేట, రెడ్‌హిల్స్, మూసాపేట, గాజులరామారం, కూకట్‌పల్లి, యూసుఫ్‌గూడ, చందానగర్ వంటి ప్రాంతాల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తలపెట్టారు. ఇప్పటికే హైదరాబాద్‌లో మొత్తం 175 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 89 మంది కంటైన్‌మెంట్ క్లస్టర్లు ప్రాంతాలలోనే నమోదవడంతో మరింత అప్రమత్తతతో వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నారు. హాట్ స్పాట్ ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు.