ఏపీలో కాంగ్రెస్ భరోసా యాత్ర

| Edited By: Team Veegam

Feb 14, 2020 | 1:50 PM

ఏపీ కాంగ్రెస్ అనంతపురం జిల్లా మడకసిరలో ప్రత్యేక హోదా భరోసా యాత్రను ప్రారంభించింది. ఏపీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ ఉమెన్ చాందీ, కర్నాటక మంత్రి శివకుమార్, ఏపీసీసీ చీఫ్ రఘువీరా, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు తదితర నాయకులు ఈ యాత్రలో పాల్గొన్నారు. 13 జిల్లాలను చుడుతూ మార్చి 3న ఇచ్చాపురంలో యాత్ర ముగుస్తుంది. ఈ నెల 22న తిరుపతిలో జరిగేసభలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ పాల్గొంటారు. ఏపీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ పాటుపడుతోందని […]

ఏపీలో కాంగ్రెస్ భరోసా యాత్ర
Follow us on

ఏపీ కాంగ్రెస్ అనంతపురం జిల్లా మడకసిరలో ప్రత్యేక హోదా భరోసా యాత్రను ప్రారంభించింది. ఏపీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ ఉమెన్ చాందీ, కర్నాటక మంత్రి శివకుమార్, ఏపీసీసీ చీఫ్ రఘువీరా, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు తదితర నాయకులు ఈ యాత్రలో పాల్గొన్నారు. 13 జిల్లాలను చుడుతూ మార్చి 3న ఇచ్చాపురంలో యాత్ర ముగుస్తుంది.

ఈ నెల 22న తిరుపతిలో జరిగేసభలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ పాల్గొంటారు. ఏపీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ పాటుపడుతోందని చెప్పారు కేవీపీ రామచంద్రరావు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా లభిస్తుందని చెప్పారు ఆ పార్టీ నేతలు. బీజేపీ, టీడీపీలు రాష్ట్రాన్ని మోసం చేశాయని అని ఆరోపించారు కేవీపీ.