కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అన్‌లాక్ 1.0 తర్వాత దేశంలో అనేక రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు అమాంతం పెరిగిపోయాయి. అందులో కేరళ రాష్ట్రం కూడా ఒకటి. అన్‌లాక్ 1.0 ముందు అక్కడ కేవలం వందల్లో ఉన్న కేసులు.. ఆ తర్వాత అమాంతం పెరిగిపోయాయి. ఇప్పటి వరకు అక్కడ ఐదు వేలకు పైగా
కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు పినరయ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. తాజాగా.. తిరువనంతరంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వం లాక్‌డౌన్ విధించి.. నిబంధనలను కఠినతరం చేసింది. అయితే ప్రజలు నిబంధనలను అతిక్రమించకుండా చూసేందుకు ఏకంగా కమాండోలను రంగంలోకి దించింది ప్రభుత్వం. తిరువనంతపురంలోని పుంథూరాలో ప్రాంతంలో ఆరు వందల మందికి కరోనా టెస్టులు నిర్వహించగా.. అందులో 119 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు.. కట్టడికి చర్యలు చేపడుతున్నారు. లాక్‌డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేసేందుకు 25 మంది స్పెషల్ ఆర్మ్‌డ్ ఫోర్స్‌కు చెందిన కమాండోలను నియమించినట్లు డీజీపీ పేర్కొన్నారు.
Kerala: 25 Commandos of Special Armed Police (SAP) deployed in Poonthura to enforce lockdown guidelines. Kerala DGP says, “Coast Guard, Coastal Security, & Marine Enforcement also put on guard here to prevent fishing boats going out to or returning from Tamil Nadu.” (08.07.20) pic.twitter.com/K15LSeTLjE
— ANI (@ANI) July 9, 2020