హెచ్‌సీయూకు పీవీ పేరు పెట్టండి.. ప్రధానికి సీఎం కేసీఆర్‌ లేఖ

|

Jun 28, 2020 | 8:06 PM

ఆర్థిక సంస్కరణలతో దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరును హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి పెట్టాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రదానికి లేఖ రాశారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలు పీవీ ఠీవీ పేరుతో ఇవాళ్టి నుంచి నెల రోజులపటు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీకి రాసిన లేఖలో సీఎం కేసీఆర్‌ తెలియజేశారు.

హెచ్‌సీయూకు పీవీ పేరు పెట్టండి.. ప్రధానికి సీఎం కేసీఆర్‌ లేఖ
Follow us on

ఆర్థిక సంస్కరణలతో దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరును హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి పెట్టాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రదానికి లేఖ రాశారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలు పీవీ ఠీవీ పేరుతో ఇవాళ్టి నుంచి నెల రోజులపటు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీకి రాసిన లేఖలో సీఎం కేసీఆర్‌ తెలియజేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. భరతమాత ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు బహుముఖ ప్రజ్ఞాశాలి. అనేక ఇతర రంగాల్లో సైతం ఆయన విశిష్ట సేవలు అందిచారని, ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

ఆర్థిక రంగంతో పాటు, విద్యారంగంలో పీవీ నరసింహారావు విప్లవాత్మక సంస్కరణలు తీసుకువచ్చారని సీఎం లేఖలో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా తొలి గురుకుల పాఠశాలను రాష్ట్రంలోనే స్థాపించారని గుర్తు చేసిన సీఎం.. జాతీయ స్థాయిలో ఏర్పాటైన నవోదయ పాఠశాలలు ఇందుకు నాంది అయ్యాయన్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లోని పీవీ హయాంలో పేద, చురుకైన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాయన్నారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీకి పూర్వ ప్రధాని పీవీ నరసింహారావు పేరు పెట్టాలనేది తెలంగాణ ప్రజల డిమాండ్‌ అని ప్రధాని మోదీకి రాసిన లేఖలో సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.