వారందరి అకౌంట్లలో పాతిక వేలు.. కేసీఆర్ సంచలన నిర్ణయం

|

May 07, 2020 | 5:19 PM

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి ఒకవైపు.. ధాన్యం సేకరణ మరోవైపు అత్యంత క్రిటికల్ పరిస్థితిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరోనా కారణంగా లాక్ డౌన్ అమలవుతున్న తరుణంలో రాష్ట్ర ఖజానా ఖాళీ అయిన నేపథ్యంలోను కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

వారందరి అకౌంట్లలో పాతిక వేలు.. కేసీఆర్ సంచలన నిర్ణయం
Follow us on

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి ఒకవైపు.. ధాన్యం సేకరణ మరోవైపు అత్యంత క్రిటికల్ పరిస్థితిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరోనా కారణంగా లాక్ డౌన్ అమలవుతున్న తరుణంలో రాష్ట్ర ఖజానా ఖాళీ అయిన నేపథ్యంలోను కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మరి కొన్ని రోజులపాటు రాష్ట్రంలోను, దేశంలోను లాక్ డౌన్ కొనసాగే పరిస్థితి కనిపిస్తున్న తరుణంలో కేసీఆర్ గురువారం జరిపిన సమీక్ష తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నరని తెలుస్తోంది.

25 వేల రూపాయలలోపు వున్న రైతు రుణాలను ఏక మొత్తంగా మాఫీ చేస్తామన్న ముఖ్యమంత్రి ఆమేరకు 1200 కోట్ల రూపాయలు గురువారం విడుదల చేశారు. వెను వెంటనే రైతు ఖాతాల్లో రుణ మాఫీ మొత్తాన్ని జమ చేయాలని ఆదేశించారు. మరో నెలా, నెలా పదిహేను రోజుల్లో వానాకాలం పంటల పనులు మొదలయ్యే పరిస్థితి వుండగా చిన్న రైతులందరికీ చేతుల్లో డబ్బులుండాలనే ఉద్దేశంతో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఆర్థిక, వ్యవసాయ శాఖ సంయుక్త సమీక్షా సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి రెండు శాఖల అధికారులకు నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు 25 వేల లోపు రైతు రుణాల ఏక మొత్తం మాఫీ కింద 1200 కోట్ల రూపాయలను ఆర్థిక శాఖ వెంటనే విడుదల చేసింది. ఆరు లక్షల పది వేల మంది రైతులకు వారి బ్యాంకు ఖాతాలో రుణ మొత్తాన్ని జమ చేయాలని ఆర్థిక మంత్రి హరీశ్ రావు, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 25 వేల లోపు రుణం ఉన్న వారి అకౌంట్లలో వెంటనే రుణ మొత్తాన్ని జమ చేయాలన్నారు. 25 వేల రూపాయల కన్నా ఎక్కువ, లక్ష రూపాయల లోపు ఉన్న వారికి నాలుగు విడతలుగా రుణ చెల్లింపులు జరిగేలా చూడాలన్నారు. ఇందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆర్థిక, వ్యవసాయ శాఖ అధికారులు మంత్రులకు తెలిపారు. దీంతో పాటు వానా కాల పంటకు రైతు బంధు సాయం పైన మంత్రులు అధికారులతో సమీక్ష జరిపారు.

సీఎం ఆదేశాల ప్రకరాం ఇతర ఖర్చులు తగ్గించుకోనైనా రైతులు పంటలు వేసే సమయానికన్నా ముందే రైతుల ఖాతాలలో డబ్బులు వేసే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రులు హరీశ్ రావు, నిరంజన్ రెడ్డి ఆదేశాలిచ్చారు. ఈ ఏడాది కోటి 40 లక్షల ఎకరాలకు రైతు బంధు నిధులు చెల్లించామన్నారు. 51 లక్షల మంది రైతులకు ఈ డబ్బు నేరుగా వారి ఖాతాల్లోకే వెళుతుందని చెప్పారు. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఆర్థిక, వ్యవసాయ శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆర్థిక, వ్యవసాయ శాఖ అధికారులను మంత్రులు హరీశ్ రావు, నిరంజన్ రెడ్డి ఆదేశించారు. రైతులకు అందించే రుణమాఫీ మొత్తాలను వెంటనే వారి అకౌంట్లలో జమ అయ్యే విషయంలో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని ఇరువురు మంత్రులు సమీక్షా సమావేశంలో పాల్గొన్న బ్యాంకు అధికారులను ఆదేశించారు.