సమీక్షలో సీఎం ఆవేదన.. అధికారులనేమన్నారంటే ?

| Edited By: Anil kumar poka

Oct 28, 2019 | 6:04 PM

” ఆదేశాల మేరకు ప్రణాళికలు రూపొందుతున్నాయి. అయితే ఆచరణ మాత్రం అంత వేగంగా.. అనుకున్న విధంగా జరగడం లేదు.. ఇంతకీ ఏం జరుగుతోంది ? ” ఇరిగేషన్ సమీక్షలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన కీలక కామెంట్లు ఇవి. అధికార పగ్గాలు చేపట్టినప్పట్నించి ఇరిగేషన్ రంగంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తే.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా చూడాలన్న తాపత్రయంతో పనిచేస్తున్న తనకు నీటిపారుదల శాఖాధికారుల నుంచి తగిన సహకారం లేదన్న ఆవేదనతో […]

సమీక్షలో సీఎం ఆవేదన.. అధికారులనేమన్నారంటే ?
Follow us on

” ఆదేశాల మేరకు ప్రణాళికలు రూపొందుతున్నాయి. అయితే ఆచరణ మాత్రం అంత వేగంగా.. అనుకున్న విధంగా జరగడం లేదు.. ఇంతకీ ఏం జరుగుతోంది ? ” ఇరిగేషన్ సమీక్షలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన కీలక కామెంట్లు ఇవి. అధికార పగ్గాలు చేపట్టినప్పట్నించి ఇరిగేషన్ రంగంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తే.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా చూడాలన్న తాపత్రయంతో పనిచేస్తున్న తనకు నీటిపారుదల శాఖాధికారుల నుంచి తగిన సహకారం లేదన్న ఆవేదనతో ఏపీ ముఖ్యమంత్రి వ్యక్తం చేసిన ఆవేదన ఇది.

పోలవరం పనులు నవంబర్ ఒకటి నుంచి ప్రారంభం కావాలి. సోమవారం జరిగిన సమీక్షా సమయానికి మిగిలి వుంది.. కేవలం 4 రోజులే. మరి జరగాల్సిన తంతు చాలానే వుంది. ఇదంతా సమీక్షలో గుర్తించిన సీఎం జగన్.. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

మరో నాలుగు రోజుల్లో పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభం కావాల్సి ఉంటుంది. రివర్స్‌ టెండరింగ్ కారణంగా ప్రాజెక్టు పనులు ఆగిపోయాయి. అదే సమయంలో భారీ వర్షాలు, వరదలు వల్ల కూడా పనులు జరిగే అవకాశం కనిపించలేదు. ఈ కాలంలో రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ప్రభుత్వం ప్రాజెక్ట్‌ హెడ్‌ వర్క్స్‌, హైడల్‌ ప్రాజెక్టుకు టెండర్లను ఖరారు చేసింది. నవంబర్‌ ఒకటో తేదీ నుంచి పనులు ప్రారంభిస్తామని కూడా ఇరిగేషన్ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ పలుమార్లు ప్రకటించారు. అయితే.. తాజా పరిణామాలు పనుల ప్రారంభానికి అనుకూలంగా లేవని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాలను అంతే వేగంగా అమలు చేయలేని అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.

రివర్స్‌ టెండరింగ్‌, పోలవరం ప్రాజెక్టు అథారిటీ అభ్యంతరాలు, ఇతర ప్రాజెక్టులపైన సమీక్షలో చర్చ జరిగింది. పోలవరం డిపిఆర్2 ఆమోదం, కేంద్ర నుంచి రావాల్సిన 3,500 కోట్ల రూపాయల బకాయిలపైన కూడా జగన్‌ చర్చించారు. కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం, గోదావరి నదుల్ని అనుసంధానం చేయడం..గోదావరి జలాల్ని రాయలసీమకు తరలించే ప్రణాళికపైన చర్చ జరిగింది. ప్రణాళిక తయారీలో ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా పని చేస్తున్న అధికారులు.. కార్యాచరణలో మాత్రం అంత వేగంగా పనిచేయడం లేదన్న అభిప్రాయంతో ప్రతీ ఒక్కరిలో మార్పు రావాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు సమాచారం.