సర్కార్‌పై సమరానికి బాబు సంచలన నిర్ణయం

|

Feb 11, 2020 | 7:17 PM

జగన్ ప్రభుత్వ విధానాలను ఎండగట్టేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నేతలు వారిస్తున్నా వినకుండా తన నిర్ణయానికి అనుగుణంగా కార్యాచరణ నిర్ణయించారు. నిర్ణయం తీసుకున్న వెంటనే దాన్ని మీడియాకు వెల్లడించారు. తెలుగుదేశంపార్టీ విస్తృత సమావేశం మంగళవారం విజయవాడలో జరిగింది. సుదీర్ఘంగా సాగిన సమావేశంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళేందుకు ఎలాంటి కార్యాచరణ అవసరమన్న అంశంపై చంద్రబాబు పార్టీ నేతల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఏపీవ్యాప్తంగా 45 రోజుల పాటు బస్సుయాత్ర చేయాలని భావిస్తున్నట్లు చంద్రబాబు […]

సర్కార్‌పై సమరానికి బాబు సంచలన నిర్ణయం
Follow us on

జగన్ ప్రభుత్వ విధానాలను ఎండగట్టేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నేతలు వారిస్తున్నా వినకుండా తన నిర్ణయానికి అనుగుణంగా కార్యాచరణ నిర్ణయించారు. నిర్ణయం తీసుకున్న వెంటనే దాన్ని మీడియాకు వెల్లడించారు.

తెలుగుదేశంపార్టీ విస్తృత సమావేశం మంగళవారం విజయవాడలో జరిగింది. సుదీర్ఘంగా సాగిన సమావేశంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళేందుకు ఎలాంటి కార్యాచరణ అవసరమన్న అంశంపై చంద్రబాబు పార్టీ నేతల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఏపీవ్యాప్తంగా 45 రోజుల పాటు బస్సుయాత్ర చేయాలని భావిస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించగా.. పలువురు పార్టీ నేతలు వద్దని వారించినట్లు సమాచారం.

అయితే, చంద్రబాబు తన ప్రతిపాదనపై గట్టిగా నిలబడినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలపై బస్సు యాత్ర ద్వారా ప్రజల మధ్యకు వెళితే మంచి ఫలితాలు వస్తాయని చంద్రబాబు పార్టీ వర్గాలు కన్విన్స్ చేసినట్లు తెలుస్తోంది. 13 జిల్లాల పరిధిలోని 100 పైగా నియోజకవర్గాలు కవర్ అయ్యేలా బస్సు యాత్రను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ తప్పిదాలపై జన చైతన్య యాత్ర చేయడమే సరైన వ్యూహంగా చంద్రబాబు ప్రతిపాదించగా.. ఈలోగా స్థానిక ఎన్నికలు వస్తే ఎలా అని పలువురు నేతలు వారించినట్లు తెలుస్తోంది.

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే యాత్ర చేస్తేనే సరైన ఫలితాలు వస్తాయని చంద్రబాబు వారికి చెప్పినట్లు సమాచారం. నియోజకవర్గాలు వదిలి ఎక్కువ రోజులు సమయం ఎలా కేటాయించగలమని మరి కొందరు నేతలు చంద్రబాబును అడిగినట్లు తెలుస్తోంది. సుదీర్ఘ చర్చ తర్వాత బస్సు యాత్రకే చంద్రబాబు మొగ్గు చూపారని, ఈ నెల 17 నుంచి టీడీపీ జన చైతన్య యాత్ర ప్రారంభించి… 45 రోజులు పాటు కొనసాగించాలని నిర్ణయించారని పార్టీవర్గాలు తెలిపాయి. టీడీపీ నేతలు కూడా ఎక్కడికక్కడ స్థానికంగా యాత్రలు చేయాలని నిర్ణయించారు.